ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి.అందులో ఎన్నో పీచర్లు కనిపిస్తున్నాయి.
ఈ ఫోన్లు మన జీవితంలో భాగం అయిపోయాయి.అవి లేకుంటే మన రోజువారీ పనులు జరగలేనంతగా వాటిపై మనం ఆధారపడిపోయాం.
అయితే చాలా కంపెనీల ఫోన్లు డ్యూయల్ సిమ్‌లతో వస్తున్నాయి.యూజర్లు కూడా రెండు రకాల కంపెనీల సిమ్‌లను ఉపయోగిస్తుంటారు.
కొన్ని ప్రాంతాల్లో కొన్ని కంపెనీల నెట్ వర్క్ బాగుంటుంది.ఈ కారణంతో రెండు రకాల సిమ్‌లు చాలా మంది వాడుతుంటారు.
అయితే రెండు సిమ్‌ల వాడకం ఇటీవల కాలంలో ఆర్థికంగా భారంగా మారుతోంది.ఇంతకు ముందు వాటికి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉండేది.
అయితే ప్రస్తుతం నెలవారీ కనీస ఛార్జీలు రీచార్జ్ చేయకుంటే ఆయా సిమ్‌లకు ఇన్‌కమింగ్ కాల్స్ కూడా రావడం లేదు.ఈ క్రమంలో సెల్ ఫోన్ కంపెనీలు కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఎక్కడ చూసినా ప్రస్తుతం డ్యూయల్ సిమ్ ఫోన్లు ఉన్నాయి.అయితే కేవలం ఒక సిమ్ మాత్రమే ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు.
నెలవారీ కనీస ఛార్జీలను వివిధ టెలికాం కంపెనీలు భారీగా పెంచేయడంతో యూజర్లకు ఆర్థిక భారం పెరుగుతోంది.రీచార్జ్ చేసుకోవాలని, లేకుంటే కనెక్షన్ కట్ చేస్తామని పలు కంపెనీలు తమ యూజర్లకు ఫోన్లు చేస్తున్నాయి.
ఇక యూజర్లు కూడా ఒక సిమ్ మాత్రమే యూజ్ చేస్తున్నారు.ఈ తరుణంలో సెల్ ఫోన్ కంపెనీలు కూడా కీలక నిర్ణయం దిశగా అడుగేస్తున్నాయి.సింగిల్ సిమ్ ఉండే ఫోన్ల తయారీకే మొగ్గు చూపుతున్నాయి.దీనికి కారణం కూడా ఉంది.ఇటీవల కాలంలో డ్యూయల్ సిమ్ మెయింటనెన్స్ చేయడం యూజర్లకు భారం అయింది.దీంతో 70 లక్షలకు పైగా ప్రజలు ఒక సిమ్‌ను వాడడం మానేశారు.
ఈ ప్రభావం ఎక్కువగా వొడాఫోన్-ఐడియాపై పడింది.ఆ తర్వాత ఎయిర్‌టెల్ కంపెనీపై ఈ ఎఫెక్ట్ పడింది.