ఒకప్పటి స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య గురించి ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియక పోయినప్పటికీ ఆ తరం ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.ఒకప్పుడు దశాబ్దాల పాటు వెండి తెరపై స్టార్ కమెడియన్ గా నవ్వులను పూయించారు అల్లు రామలింగయ్య.
ఇక ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అరవింద్ నిర్మాతగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.అయితే అల్లు అరవింద్ సినీ ఇండస్ట్రీకి రావడానికి పునాది వేసిన అల్లు రామలింగయ్య కి అవకాశాలు లేకుండా చేశారట కొడుకు అల్లు అరవింద్.
అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా!మీరు విన్నది నిజమే.ఇదే విషయాన్ని తాజాగా తెలుగు సినీ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెలిపారు.తాజాగా అల్లు అరవింద్,దర్శకుడు రాఘవేంద్రరావు, అలాగే నిర్మాత సురేష్ బాబు ముగ్గురు బాలయ్య బాబు పోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ మా తండ్రులు మా గురించి మీకు ఏం చెప్పారు చెప్పాలి అని రాఘవేంద్ర రావుని కోరారు.
దానికి అల్లు అరవింద్ స్పందిస్తూ వాళ్ళ నాన్న నాన్న తిట్లు తిట్టేవాడు.అల్లు అరవింద్ నా వద్దకు వచ్చి ఇది మా ఫ్యామిలీ మేటర్ మీరు మా నాన్నకు వేషాలు ఇవ్వకండి.

ఆయనకు వయసు పైబడింది అని చెప్పి వెళ్లేవారు అని తెలిపారు రాఘవేంద్రరావు.అల్లు అరవింద్ వెళ్లిపోయిన తర్వాత అల్లు రామలింగయ్య రాఘవేంద్రరావు దగ్గరికి వచ్చినప్పుడు వేషం లేదని చెబితే ఏంటి మావాడు వచ్చాడా అని నాకు తెలుసు వాడే నాకు ఈ వేషం ఇవ్వద్దని చెప్పి ఉంటాడు అని అల్లు అరవింద్ ని తండ్రి అల్లు రామలింగయ్య ఫుల్లుగా తిట్టేవాడట.ఈ విషయం చెప్పగానే అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు.వీటితో పాటుగా దర్శకేంద్రుడు ఎన్నో విషయాలను వెల్లడించారు.







