1.ఐక్యరాజ్యసమితిలో భారత్ వార్నింగ్

హోమియంపై ప్రజాస్వామ్యంపై ఏం చేయాలో ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడాలో భారత్ కు చెప్పనవసరం లేదని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్షురాలు రుచిరా కాంబోజ్ అన్నారు.
2.భారీగా ఉక్రెయిన్ సైనికుల మృతి
రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారీగా ప్రాణ నష్టం చోటుచేసుకుంది.ఉక్రెయిన్ వైపు భారీ సంఖ్యలో సైనికులు మరణించారు.ఈ విషయాన్ని ఒకరైన అధ్యక్షుడు సలహాదారు మైకేల్ పోడోలాక్ తెలిపారు.దాదాపు పది నుంచి పదమూడు వేల మంది మరణించినట్లు ఆయన వెల్లడించారు.
3.పుష్ప పాటకు రష్యా లో క్రేజ్

పుష్ప సినిమాను రష్యాలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు .డిసెంబర్ 8వ తేదీన రష్యన్ భాషలో దీనిని విడుదల చేయనున్నారు.అంతకంటే ముందుగా ఈ సినిమా పాట రిలీజ్ కావడంతో రష్యన్ వీధుల్లో మహిళలు ఈ సినిమాలోని పాటలకు వీధుల్లో డాన్సులు వేస్తుండడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
4.చైనాలో లాక్ డౌన్ సడలింపులు
చైనాలో కవిడ్ఉధృతి తీవ్రంగా పెరుగుతోంది.గత కొన్ని రోజులుగా రోజుకి అక్కడ 30 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి.దీంతో చాలా రోజులుగా కఠినమైన లాక్ డౌన్ నిబంధనలను ప్రభుత్వం విధించడంతో, దీనిపై తీవ్రంగా విసుగు పోయిన ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతూ ,అల్లర్లకు దిగుతుండడంతో లాక్ డౌన్ నిబంధనలను చైనా కొన్ని నగరాల్లో సడలించింది.
5.టెస్లా నుంచి హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ ట్రక్కు

ఎలక్ట్రిక్ కార్లలో పేరు పొందిన టెస్లా తన మొదటి హెవీ డ్యూటీ సెమీ ట్రక్కును ఆవిష్కరించింది.టెస్లా నివాడ ప్లాంట్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టెస్లా అధినేత ఎలెన్ మాస్క్ ఈ ట్రక్కును ఆవిష్కరించారు.
6.జాత్య అహంకారాన్ని ఎదిరించాల్సిందే
బ్రిటిష్ రాజవంశంలో జాత్య అహంకార ధోరణి వెల్లడైన నేపథ్యంలో ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్ స్పందించారు.జాతీయ అహంకార ధరణి ఎప్పుడు ఎక్కడ ఎదురైనా దానిని తప్పనిసరిగా ఎదిరించాలని ఆయన వ్యాఖ్యానించారు.
7.అమెరికా యోగ యూనివర్సిటీలో పిహెచ్ డి

అమెరికాలో వివేకానంద యోగ యూనివర్సిటీ పీహెచ్డీ ప్రోగ్రామ్ ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది.







