Duniya Vijay Balakrishna : బాలయ్య వ్యక్తిత్వం ఏ హీరోలోను చూడలేదు.. నటుడు ఎమోషనల్ కామెంట్స్!

నందమూరి నటసింహం బాలకృష్ణ చూడటానికి ఎంతో గంభీర్యంగా కనిపించినప్పటికీ ఈయన మనసు మాత్రం చాలా మంచిదని ఇప్పటికే ఎంతోమంది ఆయనతో కలిసి నటించిన నటీనటులు ఆయన మనస్తత్వం గురించి తెలియజేశారు.బాలకృష్ణ కోపిష్టి అని అందరూ అంటారు తప్ప అతని మంచి మనసు గురించి ఆయనని దగ్గరగా చూసిన వారికి మాత్రమే తెలుస్తుందని పలువురు సెలబ్రిటీలు చెప్పుకొచ్చారు.

 Balayya's Personality Is Not Seen In Any Hero.. Actor's Emotional Comments , Bal-TeluguStop.com

బాలకృష్ణ వ్యక్తిత్వం ఆయన మంచితనం గురించి మరొక హీరో తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.

ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

బాలకృష్ణ శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణతో దునియా విజయ్ పోటీ పడబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇప్పటికే దునియా విజయ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది ఇకపోతే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో పలు ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

Telugu Balakrishna, Balayya, Duniya Vijay, Shruti Haasan-Movie

ఈ సందర్భంగా దునియా విజయ్ మాట్లాడుతూ బాలకృష్ణ గారు దేవుడు తనకు ఇచ్చిన అన్నయ్య అని చెప్పడమే కాకుండా కేవలం తాను బాలకృష్ణ కోసం మాత్రమే వీరసింహారెడ్డి సినిమాలో నటించానని తెలిపారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ గారితో పంచుకున్న అనుభవాల గురించి మాటలలో చెప్పలేను.తాను ఇప్పటివరకు ఎంతోమంది హీరోలతో పని చేసిన బాలకృష్ణ లాంటి వ్యక్తిత్వం ఏ ఒక్క హీరోలోనూ చూడలేదని ఈయన ఎమోషనల్ అయ్యారు.

ఇక సినిమా గురించి మాట్లాడుతూ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అంటూ ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube