NTR Sitarama kalyanam: ఎన్టీఆర్ నెగటివ్ పాత్ర చేస్తా అంటే భయపడి సినిమా నుంచి తప్పుకున్న డైరెక్టర్

సినిమా తీయాలంటే ఎంతో గట్స్ ఉండాలి.తీరా అన్ని కష్టాలకు ఓర్చి సినిమా తీసిన తర్వాత ఆ సినిమా విడుదలకు ముందే ఫ్లాప్ అవుతుంది అని నటించిన నటీనటులు అంటే ఇంకా ఏమైనా ఉంటుందా ? అలాంటి ఒక పరిస్థితి సీనియర్ ఎన్టీఆర్ కి వచ్చింది.అది కూడా సీత రామ కళ్యాణం వంటి ఒక క్లాసిక్ సినిమా గురించి.ఈ సినిమా 1961 లో వచ్చి ఘనవిజయం సాధించింది.అయితే ఈ చిత్రంలో అన్నగారు రావణాసురిడి పాత్రలో నటించారు.అయన నెగటివ్ పాత్రలో నటించి రాముడి పాత్రలో పాత్రలో హీరో హరనాథ్ చేత వేయించారు.

 Ntr Sitha Rama Kalyanam Story Details, Ntr, Ntr Sitarama Kalyanam, Sr Ntr, Nanda-TeluguStop.com

ఇక సీత గా అప్పటి యువనటి అయినా గీతాంజలి నటించింది.

ఇక రాముడి సోదరుడు శత్రజ్ఞుడి పాత్రలో కృష్ణ నటించాల్సి ఉండగా, మేకప్ టెస్ట్ అయ్యాక ఎందుకో నచ్చక ఎన్టీఆర్ ఆయన్ను ఈ సినిమా నుంచి తప్పించారు.

ఇక ఈ చిత్రంలో రాముడి పాత్ర కన్నా కూడా రావణాసురిడి పాత్ర హైలెట్ అవుతుంది.అందుకనే అన్నగారు రాముడి పాత్ర కాకుండా రావణాసురిడి పాత్రలో నటించారు.ఇక ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం కూడా వహించారు.తన టీమ్ సహాయ సహకారాలతో ముఖ్యమైన పాత్రలో నటిస్తూ కూడా దర్శకత్వ బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వహించగలిగాడు.

అయితే సినిమా మేకింగ్ విషయం ఎలా ఉన్న సినిమాలో నటించిన ఎవరికీ కూడా ఈ చిత్రం విజయం సాధిస్తుంది అనే నమ్మకం లేదు.ఎందుకంటే సినిమా కథ పై అప్పటికి చాల సినిమాలు రావడం కథ తెలిసింది కావడం.

Telugu Kv Reddy, Geetanjali, Haranath, Krishna, Nandamuritaraka, Ntrsitarama, Ra

ఈ విషయం ఎన్టీఆర్ వరకు వెళ్లడం తో అయన సినిమా విడుదలకు ముందు రోజు తమిళనాడు గవర్నర్ తో సహా అనేక మంది సినిమా ప్రముఖులను పిలిచి విందు ఏర్పాటు చేశారు.ఆ విందు కోసం బారి గా సీతారామ క‌ళ్యాణం వేదిక‌ను కూడా ఏర్పాటు చేయించి అన్ని రకాల పిండి వంటకాలతో విందు భోజనం పెట్టించి ఆ సినిమాను కూడా చూపించాడు.అందరు కమ్మగా భోజనం చేసి సినిమా చాల బాగుంది అని చెప్పారు.

Telugu Kv Reddy, Geetanjali, Haranath, Krishna, Nandamuritaraka, Ntrsitarama, Ra

అందరూ చెప్పినట్టుగానే సినిమా ఘనవిజయం సాధించింది.ఇక కాంతారావు లాంటి హీరో సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇంత ఖర్చు ఎందుకు చేసారు అంటే మీరెవరు నన్ను నమ్మలేదు కాబట్టి అంటూ ఎన్టీఆర్ చెప్పారట.ఇక ఎన్టీఆర్ ఎప్పుడైతే రావణాసురుడు పాత్ర చేస్తాను అని చెప్పారో అప్పుడే కెవి రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేయలేను అని తప్పుకోవడం తో ఎన్టీఆర్ స్వయంగా చేసుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube