కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ కు చిక్కులు తప్పడం లేదు.ఆయన భార్య సునంద పుష్కర్ మృతి కేసు వెంటాడుతూనే ఉంది.
కాగా ఈ కేసులో ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వడంపై ఢిల్లీ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.శశిథరూర్ పై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ గత సంవత్సరం పాటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ ను స్వీకరించిన ఢిల్లీ న్యాయస్థానం శశిథరూర్ కు నోటీసులు జారీ చేసింది.పోలీసుల పిటిషన్ పై సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది.
అదేవిధంగా కేసుకు సంబంధించిన పత్రాలను వేరే వ్యక్తులకు పంపించొద్దని ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను 2023 ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది.