టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అందరికీ సుపరిచితమే.ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా మరోవైపు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి వ్యాపారవేత్తగా కూడా సక్సెస్ అయ్యారు.
ఇప్పటికే మహేష్ బాబు ఏషియన్స్ వారితో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఇలా థియేటర్ బిజినెస్ లో సక్సెస్ అయినటువంటి మహేష్ బాబు తిరిగి ఏషియన్ వారితో కలిసి రెస్టారెంట్ బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టారు.
హైదరాబాదులో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏషియన్స్ వారితో కలిసి తన భార్య నమ్రత పేరు మీదగా ఏఎన్ (ఏషియన్స్, నమ్రత)రెస్టారెంట్ ప్రారంభించబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఈ రెస్టారెంట్ నిర్మాణ పనులన్నీ పూర్తి కావడంతో పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఈ రెస్టారెంట్ ప్రారంభించారని తెలుస్తుంది.
అయితే ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో మహేష్ బాబు కుటుంబ సభ్యులు హాజరు కాలేదు.

మహేష్ బాబు తండ్రి కృష్ణ మరణించడంతో ఇలాంటి పూజా కార్యక్రమాలలో పాల్గొనకూడదని సన్నిహితులు తెలియజేయడంతో మహేష్ బాబు నమ్రత దంపతులు ఈ రెస్టారెంట్ పూజా కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఏషియన్స్ వారు పూజా కార్యక్రమాలను నిర్వహించి ఈ రెస్టారెంట్ ప్రారంభించారని తెలుస్తుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ రెస్టారెంట్ బిజినెస్ కనుక మంచిగా అభివృద్ధి చెందితే ఇలాంటివి దేశంలో పలు నగరాలలో ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.