Vijayalakshmi allu arjun : పుష్ప సినిమా చూశాను.. కానీ ఆ హీరో ఎవరో నాకు తెలీదు.. నటి కామెంట్స్ వైరల్?

ఈ తరం ప్రేక్షకులకు ఒకప్పటి సీనియర్ నటి ఎల్ విజయలక్ష్మి గురించి అంతగా తెలియకపోవచ్చు కానీ ఆ తరం ప్రేక్షకులకు విజయలక్ష్మి సుపరిచితమే.అప్పట్లో ఆమె ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది.

 Vijayalakshmi Talaking About Pushpa Movie Vijayalakshmi, Pushpa Movie, Tollywood-TeluguStop.com

అంతేకాకుండా ఆమెతో డాన్స్ చేయడం కోసం స్టార్ హీరోలు సైతం డాన్స్ చేయాలి అనుకునేవారు అంటే అప్పట్లో ఆమె రేంజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.కెరీర్ బాగా పీక్స్ లో ఉన్న సమయంలో ఆమె పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది.

తర్వాత ఆమె చాలా రేర్ గా మాత్రమే కనిపించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా విజయలక్ష్మి ఈటీవీలో ఆలీ నిర్వహించే ఆలీతో సరదాగా ప్రోగ్రాం కి వచ్చింది.

ఈ నేపథ్యంలోనే ఆమె ఎన్నో విషయాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.

నేను ఐదేళ్ల ఉన్నప్పుడే టీవీలో నాట్యం చూస్తూ ఆనాట్యాన్ని చేసే దాన్ని.నాకు పాటలు వినిపిస్తే చాలు ఆటోమేటిక్ గా డాన్స్ వస్తుంది అని ఆమె తెలిపింది.

సీనియర్ ఎన్టీఆర్ తనను కోడలా కోడలా అని పిలిచే వారిని సీనియర్ ఎన్టీఆర్ నటించిన గుండమ్మ కథ సినిమాలో తన సాంగ్ లేకుండా సినిమా షూటింగ్ జరిగిందని, తనతో ఒక్క సాంగ్ అయినా చేయించాలి అని సాంగ్ లేకుండా కేవలం మ్యూజిక్ తోనే సాంగ్ పెట్టించారు అని చెప్పుకొచ్చింది విజయలక్ష్మి.

Telugu Allu Arjun, Pushpa, Rashmika, Sukumar, Tollywood, Vijayalakshmi-Movie

ఆ తర్వాత ఆలీ ఈ జనరేషన్ హీరోలు నటించిన ఏ సినిమాను చూశారు అని అడగగా. పుష్ప సినిమాను చూశాను అని అనగా వెంటనే ఆలీ ఆయన ఎవరో తెలుసా అని అడగడంతో తెలియదు అంటూ సమాధానం ఇచ్చింది.అప్పుడు వెంటనే ఆలీ అల్లు రామలింగయ్య గారి మనవడు అని చెప్పడంతో వెంటనే విజయలక్ష్మి ఈ మధ్యకాలంలో హీరోల గురించి అడిగితే రామానాయుడు మనవడు, ఎన్టీఆర్ మనవడు అని చెబుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది.

అయితే ఇంటర్వ్యూలో భాగంగా ఆమె అల్లు అర్జున్ ఎవరో తెలియదు అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube