Arab countries Sheikh Chand Pasha: ఎడారి దేశంలో తెలంగాణా వాసి మృతి...అనాధగా 10 రోజుల పాటు....

సొంత ఊరిలో ఉపాది కంటే కూడా ఎడారి దేశంలో చేతినిండా పని దొరుకుంటుందని, ఇంకా ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చునని భావించి అరబ్బు దేశాలకు ఎంతో మంది పయనమవుతారు.తీరా అక్కడికి వెళ్ళిన తరువాత చేసే పని నచ్చక పొతే వెనక్కి తిరిగి రాలేని పరిస్థితి ఇంతా ఖర్చు చేసుకుని వచ్చాక వెళ్లలేరు.

 A Resident Of Telangana Died In The Desert Country Orphaned For 10 Days , Deser-TeluguStop.com

కష్టమో నష్టమో ఎంతో కొంత డబ్బు వెనకేసుకుని వెళ్లాలని భావిస్తారు.కుటుంబాలకు దూరంగా ఉంటూ పిల్లలను చూసుకోలేక వారు పడే బాధ, ఆ బాధను దిగ మింగుకుంటూ పని చేసుకోవాలంటే ఎంతో కష్టమో.

అయితే ఇలాంటి ఇబ్బంది కరమైన పరిస్థితులలో ఎంతో ఒత్తిడికి లోనయ్యి అక్కడ పనిచేయాల్సి ఉంటుంది.ఈ క్రమంలో ఎంతో మంది అనారోగ్యాల పాలవుతారు, కొందరు అక్కడే మృతి చెందుతారు.

ఇలాంటి సంఘటనే సౌదీ లో తెలుగు ప్రవాస కార్మికుడికి జరిగింది.అతడి పేరు షేక్ చాంద్ పాషా సౌదీ లోని మదీనా మున్సిపాలిటీ లో రోడ్లు ఊడ్చే పనిలో కుదిరిన తెలంగాణా వాసి అక్కడికి వెళ్ళాక ఆ పని నచ్చక పోవడంతో ఎడారి ప్రాంతంలో ఖర్జూరం తోటలో కలుపు తీసే పనిలో కుదిరాడు.

అంతా బాగానే ఉందనుకుంటున్న క్రమంలో అతడి ఆరోగ్యం క్షీణించగా గుండె పోటు తో తోటలో పనిచేస్తున్న క్రమంలోనే మృతి చెందాడు.

Telugu Telanganadesert, Arab, Desert, Saudi, Telangana-Telugu NRI

అతడి జాడ కనపడక పోగా పట్టించుకునే వారు లేక పోవడంతో దాదాపు 10 రోజులు తరువాత అటుగా వెళ్తున్న వారికి భయంకరమైన దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు.దాంతో పోలీసులు ఘటనా స్థలంలో ఉన్న అతడ మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు.అతడి వివరాలు తెలుసుకుని అతడు చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

కాగా కుటుంభ సభ్యులు అతడి మరణ వార్త విని ఆవేదనకు గురయ్యారు.అయితే అతడి అంత్యక్రియలకు ఎలాంటి అధికారిక అనుమతులు ఉంటాయో వారికి తెలియక పోవడంతో అక్కడే ఉంటున్న సామాజిక కార్యకర్త ఫారూక్ చొరవతో మదీనా మున్సిపాలిటీ అధికారులు అంత్యక్రియలు నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube