కువైట్ అనగానే సహజంగా వలస కార్మికులు అత్యధికంగా వెళ్ళే అరబ్బు దేశంగానే కనిపిస్తుంది అయితే అక్కడ ఎన్నో రంగాలలో నిపుణులైన వారికి మంచి అవకాశాలు కూడా ఉంటాయి.అంతేకాదు వ్యాపారాన్ని ప్రారంభించి అభివృద్ధి చేసుకోవాలనుకునే వారికి అరబ్బు దేశాలు ఎంతో అనుకూలంగా ఉంటాయి, అక్కడి ప్రభుత్వాలు కూడా అందుకు తగ్గట్టుగా ప్రోశ్చాహాన్ని అందిస్తాయి.
ఈ క్రమంలోనే ఎంతో మంది నిపుణులైన భారతీయులు, కార్మికులు ఎంతో మంది వలసలు వెళ్తుంటారు.దాంతో కువైట్ లో అత్యధికంగా వలసలు వచ్చిన దేశాలతో పోల్చితే భారతీయులే అత్యధికంగా ఉంటారు.
అయితే తాజాగా అక్కడి భారతీయ కమ్యూనిటీ లకు చెందిన ఓ స్కూల్ భారతీయ విద్యార్ధుల కోసం ఎడ్యుకేషన్ ఫెయిర్ ను ఏర్పాటు చేసింది.
కువైట్ లోని సల్మియా ప్రాంతంలో భారత కమ్యూనిటీ స్కూల్ బ్రాంచ్ లో డిసెంబర్ 9 10 తేదీలలో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ఉదయం 9 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.ఈ ఫెయిర్ ప్రముఖ బిజినెస్ , మెడిసిన్, ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విదేశాల విశ్వవిద్యాలయాల నుంచి అలాగే భారత్ లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి నిపుణులు పాల్గొంటారని తెలిపారు.
ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ తప్పనిసరిగా భారతీయ విద్యార్థులకు తల్లిదండ్రులకు మార్గదర్శకం అవుతుందని వివిధ దేశాలలో ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని భారత కమ్యూనిటీ స్కూల్ తెలిపింది.

ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ కు హాజరయ్యే నిపుణులు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారని వారి భవిష్యత్ ప్రణాళికలు తప్పకుండా దిశానిర్దేశం చేస్తారని,ఈ అవకాశాన్ని భారతీయ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపయోగించుకో వలసిందిగా కోరారు.ఈ ఎడ్యుకేషనల్ ఫెయిర్ కు స్పాన్సర్స్ గా మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, జైన్ వర్సిటీలు అలాగే గోల్డెన్ స్పాన్సర్లు గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ రూర్కీ ఇంకా పలు వర్సిటీలు వ్యవహరిస్తున్నాయి







