ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.అయితే ఉప్పెన సక్సెస్ తర్వాత చాలామంది హీరోల నుంచి ఆఫర్లు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో బుచ్చిబాబు తారక్ కు కథ చెప్పి ఒప్పించారు.
అయితే కారణాలు ఏవైనా ఈ కాంబినేషన్ లో సినిమా రాలేదు.అయితే ఈ మధ్య కాలంలో కొందరు దర్శకులు ఒక హీరోకు కథ చెబితే ఆ హీరోతో సినిమా చేయడం కోసం ఎంతకాలమైనా ఎదురుచూస్తున్నారు.
అయితే బుచ్చిబాబు మాత్రం ఇతర హీరోలకు భిన్నంగా తారక్ మూవీ ఛాన్స్ కోల్పోయిన వెంటనే చరణ్ తో సినిమా దిశగా అడుగులు వేశారు.జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను మొదలుపెట్టి వీలైనంత వేగంగా ఈ సినిమాను పూర్తి చేయాలని ఆయన అనుకుంటున్నారు.
అయితే బుచ్చిబాబుకు ఉన్న ధైర్యం ఇతర డైరెక్టర్లకు ఉంటే ఇతర డైరెక్టర్లు కూడా ఈ దిశగా అడుగులు వేయాల్సి ఉంది.
ఊరికే సమయాన్ని వృథా చేయడం ఫలితం శూన్యమని బుచ్చిబాబులా ఇతర డైరెక్టర్లు కూడా గ్రహిస్తే ఎలాంటి సమస్య ఉండదు.

హరీశ్ శంకర్ మరి కొందరు డైరెక్టర్లు ఈ దిశగా అడుగులు వేస్తే మంచిదని చెప్పవచ్చు.మనిషి జీవితంలో తిరిగి పొందలేనిది కాలం మాత్రమేననే సంగతి తెలిసిందే.ఖాళీగా ఉండటం వల్ల దర్శకుల కెరీర్ లో విలువైన సమయం పోతుందనే సంగతి తెలిసిందే.

దర్శకుడు బుచ్చిబాబు ఒక్కో ప్రాజెక్ట్ కు 5 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.చరణ్ సినిమాతో సక్సెస్ ను అందుకుంటే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ల జాబితాలో బుచ్చిబాబు కూడా ఉంటారని చెప్పవచ్చు.బుచ్చిబాబుకు సోషల్ మీడియాలో కూడా భారీ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.







