తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం 12 వారాలను పూర్తి చేసుకుని 13వ వారంలోకి అడుగు పెట్టింది.ఇలా ఈ కార్యక్రమం రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారడమే కాకుండా విజేతగా నిలవడం కోసం ప్రతి ఒక్క కంటెస్టెంట్ తమ సాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలా నామినేషన్స్ నుంచి మొదలుకొని టాస్కుల వరకు కూడా నువ్వా నేనా అన్న విధంగా పోటీ పడుతూ పర్ఫామెన్స్ చేస్తున్నారు.ఇకపోతే సోమవారం జరిగిన ఎపిసోడ్ లో భాగంగా శ్రీహాన్, రేవంత్ మధ్య కాస్త వివాదం చోటుచేసుకుంది.
ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి రేవంత్ శ్రీహాన్ ఇద్దరూ కూడా స్ట్రాంగ్ కంటేస్టెంట్లుగా ఉన్నారు.
ప్రతిసారి నామినేషన్ లో ఉన్నప్పుడు అత్యధిక ఓట్ల సంపాదించుకొని టాప్ పొజిషన్లో నిలబడుతున్న వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఏర్పడింది.
తాజా ఎపిసోడ్ లో భాగంగా గతంలో రేవంత్ చేసిన తప్పులను ఎత్తిచూపుతూ శ్రీహాన్ తనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా శ్రీహాన్ మాట్లాడుతూ మన ఇద్దరి మధ్యలో ఒక అమ్మాయి ఉందనే విషయం మర్చిపోయి నేను దుప్పటి పట్టుకుని వెళ్తాను అని మరొక అర్థం వచ్చేలా మాట్లాడుతున్నావని శ్రీహాన్ చెప్పారు.

ఇక ఈ మాటలకు రేవంత్ మాట్లాడుతూ తాను ఏం మాట్లాడినా కానీ చాలా సరదాగా మాట్లాడానని అయితే వాటిని నువ్వు సీరియస్ గా తీసుకొని హైలైట్ చేస్తున్నావంటూ రేవంత్ రిప్లై ఇచ్చారు.అయితే శ్రీహన్ మాత్రం రేవంత్ మాటలను ఏమాత్రం అంగీకరించలేదు.నేను కొన్ని మాటలు మాట్లాడుకూడదని ఊరికే ఉన్నాను నీ గురించి కనుక నేను మాట్లాడితే తప్పకుండా నీ ఇంట్లో గొడవలు జరుగుతాయి అంటూ ఈ సందర్భంగా శ్రీహన్ రేవంత్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలా వీరిద్దరు కూడా పెద్ద ఎత్తున గొడవ పడుతూ ఉన్నప్పటికీ హౌస్ సభ్యులందరూ చూస్తూ ఉన్నారే తప్ప వీరి గురించి ఏమీ మాట్లాడలేకపోయారు.
ఇలా గొడవపడిన కాసేపటికి, శ్రీహాన్ రేవంత్ ఇద్దరూ కూడా నార్మల్ అయ్యారు.







