Kamal Hassan Trisha :కమల్ కోసం రిస్క్ చేస్తున్న త్రిష..!

కమల్ హాసన్ కోసం త్రిష రిస్క్ తీసుకుంటుందా.అంటే అవుననే అంటున్నారు ఆమె అభిమానులు.

 Trisha Taking Risk For Kamal Hassan Details, Kamal Hasan, Trisha, Kollywood, Kam-TeluguStop.com

తెలుగు లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్లలో నటించి మెప్పించిన త్రిష.తమిళ్ లోనే వరుస సక్సెస్ లు అందుకుంది.

ఆ తర్వాత కొత్త హీరోయిన్ల రాకతో అమ్మడికి ఛాన్సులు తగ్గాయి.రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ వన్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌ని గ్రాండ్ గా మొదలుపెట్టింది.

ఈ సినిమాలో త్రిష లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.ప్రస్తుతం మళ్లీ వరుస సినిమాలు చేసేందుకు సిద్ధమైంది.

ఇప్పటికే పలు ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అందులో ఒకటి కమల్ హాసన్ మూవీ.ఈ మూవీ లో త్రిష వేశ్య పాత్రలో నటించనుందట.తన అభిమాన నటుడు కమల్ హాసన్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ పాత్రకు ఓకే చెప్పేసిందట.

బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన గంగుబాయ్ కత్తియవాడి సినిమా ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.అయితే త్రిష ఇలాంటి రిస్కీ పాత్రను ఎంచుకోవడం ఆమె కెరీర్‌ను రిస్క్‌లో పెట్టుకోవడమేనని అభిమానులు అంటున్నారు.

మరి నిజంగా అభిమానులు భావిస్తున్నట్లు త్రిష రిస్క్ లో పడుతుందా.? లేక ఈ పాత్రే ఆమె స్థాయిని పెంచుతుందా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube