కమల్ కోసం రిస్క్ చేస్తున్న త్రిష..!

కమల్ హాసన్ కోసం త్రిష రిస్క్ తీసుకుంటుందా.అంటే అవుననే అంటున్నారు ఆమె అభిమానులు.

తెలుగు లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్లలో నటించి మెప్పించిన త్రిష.తమిళ్ లోనే వరుస సక్సెస్ లు అందుకుంది.

ఆ తర్వాత కొత్త హీరోయిన్ల రాకతో అమ్మడికి ఛాన్సులు తగ్గాయి.రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ వన్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌ని గ్రాండ్ గా మొదలుపెట్టింది.

ఈ సినిమాలో త్రిష లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.ప్రస్తుతం మళ్లీ వరుస సినిమాలు చేసేందుకు సిద్ధమైంది.

ఇప్పటికే పలు ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అందులో ఒకటి కమల్ హాసన్ మూవీ.

ఈ మూవీ లో త్రిష వేశ్య పాత్రలో నటించనుందట.తన అభిమాన నటుడు కమల్ హాసన్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ పాత్రకు ఓకే చెప్పేసిందట.

బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన గంగుబాయ్ కత్తియవాడి సినిమా ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే త్రిష ఇలాంటి రిస్కీ పాత్రను ఎంచుకోవడం ఆమె కెరీర్‌ను రిస్క్‌లో పెట్టుకోవడమేనని అభిమానులు అంటున్నారు.

మరి నిజంగా అభిమానులు భావిస్తున్నట్లు త్రిష రిస్క్ లో పడుతుందా.? లేక ఈ పాత్రే ఆమె స్థాయిని పెంచుతుందా అనేది చూడాలి.

Realme 12X 5G : రియల్ మీ 12X 5G స్మార్ట్ ఫోన్ ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ.. లాంచింగ్ ఎప్పుడంటే..?