వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరం తండా వద్ద పాదయాత్ర సాగిస్తున్న వైఎస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ క్రమంలో తన అరెస్ట్, పోలీసుల తీరుపై షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పోలీసుల వాహనాన్ని అడ్డుకునేందుకు వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు ప్రయత్నించారు.పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
మరోవైపు షర్మిల కాన్వాయ్ వద్దకు టీఆర్ఎస్ కార్యకర్తలు దూసుకొచ్చారు.అనంతరం షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
కాగా పోలీసులు షర్మిలను నర్సంపేట పోలీస్ స్టేషన్ కు తరలించనున్నారు.అయితే టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తమ వాహనాన్ని తగులబెట్టే ప్రయత్నం చేసినా పోలీసులు పట్టుకోలేదని షర్మిల ఆరోపిస్తున్నారు.







