పోలీసు అధికారులు తమ డ్యూటీ వేళల్లో చాలా ప్రమాదాలను ఫేస్ చేస్తుంటారు.నేరగాళ్లను పట్టుకునే క్రమంలో వీరు గాయాల పాలు కూడా అవుతుంటారు.
రిస్క్ చేసి నేరస్తులను పట్టుకొని సమాజంలో శాంతియుతమైన వాతావరణం నెలకొల్పడానికి వీరు తమ వంతు ప్రయత్నిస్తారు.కాగా రీసెంట్‌గా ఒక పోలీసు అధికారి పబ్లిక్ రోడ్‌లో స్నాచర్‌ను పట్టుకోవడం కోసం బైక్ పై నుంచి దూకి పెద్ద సాహసమే చేశారు.
గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఢిల్లీ పోలీసులు ట్విట్టర్‌లో షేర్ చేశారు.
ఈ వీడియోలో యూనిఫారం ధరించిన పోలీసు అధికారి మోటర్‌బైక్‌ను నడుపుతున్నప్పుడు మరొక వ్యక్తి మోటార్‌సైకిల్‌కి ఎదురుగా వచ్చారు.
ఆ పోలీసు వెంటనే తన బైక్ నిలిపివేసి, దానిపై నుంచి దూకి తప్పించుకునే స్నాచర్‌ను పట్టుకున్నారు.ఆ స్నాచర్ అప్రమత్తమై పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ప్యాంట్‌ను పట్టుకుని, చివరికి మంచి పట్టు సాధించి, పారిపోకుండా అడ్డుకున్నారు.
‘షహబాద్ డైరీ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ సత్యేంద్ర ఒక స్నాచర్‌ను అరెస్టు చేశారు.ఈ స్నాచర్ అరెస్ట్‌తో 11 కేసులు ఛేదించబడ్డాయి.చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. హీరోస్ ఆఫ్ ఢిల్లీ పోలీస్’ అని ఢిల్లీ పోలీసులు వీడియోతో సహా ఓ ట్వీట్ చేశారు.రెండు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి.ఈ అధికారిని నెటిజన్లు హీరోగా పొగుడుతున్నారు.‘మీలాంటి ఆఫీసర్లు ఉంటే ఒక్కడు కూడా నేరం చేయరు, మీరు సూపర్’ అని ఒక నెటిజెన్ కామెంట్ చేశారు.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.