Ramajogaiah Sastry Balakrishna : నెటిజన్స్ ట్రోల్స్.. నొచ్చుకున్న రామజోగయ్య శాస్త్రి.. వైరల్ ట్వీట్!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో సెలబ్రిటీల విషయంలో నెగెటివిటీ కూడా పెరిగిపోతోంది.సెలబ్రిటీలపై నెగిటివిటీ పెరిగిపోవడం మాత్రమే కాకుండా వారిని విమర్శిస్తున్నారు.

 Lyricist Ramajogayya Sastry Hurts Over Jai Balayya Song Criticism , Ramajogayya-TeluguStop.com

క్రమంగా ఇది ఎదుటి వ్యక్తిని బాధపెట్టి అంత దూరం వెళుతోంది.కథ తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు ప్రముఖ సినీ గేయ రచయిత అయిన రామ జోగయ్య శాస్త్రి బాధపెట్టినట్లు ఉన్నాయి.

దీంతో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ట్విట్టర్ లో కాస్త ఘాటుగా స్పందించారు.బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో తాజాగా జై బాలయ్య అనే పాట విడుదలైన విషయం తెలిసిందే.

ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి రాశారు.ఈ పాటలో బాలయ్య బాబుని పొగుడుతూ పాటను రాశారు రామ జోగయ్య శాస్త్రి.అయితే ఈ పాటకు తమన్ ఇచ్చిన ట్యూన్ ప్రస్తుతం విమర్శలను ఎదుర్కొంటోంది.ఈ పాట ఒసేయ్ రాములమ్మ పాటను పోలి ఉందని, తమన్ మళ్లీ ట్యూన్ ని కాపీ కొట్టారు అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు.

ఈ క్రమంలోనే కొందరు రామజోగయ్య శాస్త్రిని కూడా టార్గెట్ చేస్తూ ఆ లిరిక్స్ ఏంటంటూ విమర్శలు గుప్పించడంతో తాజాగా ఆ విషయంపై స్పందిస్తూ ఒక ట్వీట్ చేశారు రామజోగయ్య శాస్త్రి.ప్రతి పాటకు ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను.

దయచేసి నన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు.

అన్నట్టు జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్థం నా పేరును సరస్వతీపుత్ర రామ జోగయ్య శాస్త్రిగా మార్చుకున్నాను.ఇందులో ఎవరికి ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు.ఇటు రాకండి అంటూ తన ట్వీట్లో పేర్కొన్నాడు రామ జోగయ్య శాస్త్రి.

ఇందుకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చివర్లో చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీని కూడా షేర్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube