ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్నాక ఎలాన్ మస్క్ కీలక మార్పులు అమల్లోకి తీసుకొచ్చాడు.అందులో ముఖ్యమైనది బ్లూ టిక్కు నెలవారి 8 డాలర్లు చెల్లించడం.
అయితే దీనిపై పలు విమర్శలు వచ్చాయి.కొందరు మోసగాళ్లు డబ్బులు చెల్లించి ప్రముఖులు, ప్రముఖ సంస్థల పేర్లతో నకిలీ ఖాతాలను పొందారు.
దీంతో ఈ చర్య వివాదం అయింది.దీనిపై స్పందించిన మస్క్ గతంలో ట్విటర్లో బ్లూ టిక్‌లు పొందేందుకు డబ్బులు చెల్లించే ప్లాన్ నిలిపి వేశారు.
తాజాగా దీనిపై ఆయన కీలక ప్రకటన చేశారు.ఇప్పుడు ట్విట్టర్ వెరిఫైడ్ టిక్ సేవలు వచ్చే వారం పునఃప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
అలాంటి సంకేతాలు ఎలోన్ మస్క్ ఇచ్చారు.ప్రభుత్వం, కంపెనీలు, సెలబ్రెటీలకు వేర్వేరుగా వెరిఫైడ్ బ్యాడ్జిలను అందించనున్నట్లు ప్రకటించారు.
మూడు వేర్వేరు రంగుల బ్యాడ్జిలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ ప్రకటించారు.అంటే, అన్ని ధృవీకరించబడిన ఖాతాలకు వేర్వేరు రంగుల బ్యాచ్‌లు ఇవ్వబడతాయి.
నిలిచిపోయిన ప్లాన్‌ను మళ్లీ ప్రారంభించడం గురించి వినియోగదారుని అడిగినప్పుడు, మస్క్ వచ్చే వారం ప్రారంభించనున్నట్లు బదులిచ్చారు.

గతంలో బ్లూ టిక్ విషయంలో జరిగిన పరిణామాలు బాధాకరమని అన్నారు.వెరిఫైడ్ బ్యాడ్జిలు తీసుకు రావడంలో ఆలస్యానికి క్షమాపణలు కోరుతున్నామని, వెరిఫైడ్ వచ్చే వారం శుక్రవారం ప్రారంభించే అవకాశం ఉంది అని ఆయన తన ట్వీట్లో రాశారు.వెరిఫై చేయబడిన ఖాతాలు వ్యాపారాల కోసం గోల్డ్ చెక్ మార్క్, ప్రభుత్వ అధికారులకు బూడిద రంగు బ్యాడ్జి, సెలబ్రెటీలకు బ్లూ టిక్ ఉంటాయి.ట్విట్టర్ బ్లూ టిక్ ధర భారతదేశంలో నెలకు రూ.720.అదే సమయంలో, అమెరికా మరియు ఇతర దేశాలలో దీని ధర 8 డాలర్లుగా ఉంది.