వృత్తి, ఉద్యోగ వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడ కీలక స్థానాలకు చేరుకుంటున్న సంగతి తెలిసింది.శాస్త్రవేత్తలుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, రాజకీయ నాయకులుగా రాణిస్తున్నారు.
అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాలలో భారతీయుల ప్రాబల్యం పెరుగుతోంది.తాజాగా యూరోపియన్ దేశం జర్మనీలోనూ ఇప్పుడిప్పుడే భారతీయుల హవా ప్రారంభమవుతోంది.
ఈ క్రమంలో భారత సంతతికి చెందిన జర్మన్ జాతీయుడైన గుర్దీప్ సింగ్ రంధావా … తురింగియా రాష్ట్ర క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్ (సీడీయూ) పార్టీ ప్రెసిడియంలో నియమితులయ్యారు.
గుర్దీప్ సీడీయూలో క్రియాశీల సభ్యునిగా వ్యవహరిస్తున్నారు.
పార్టీ పట్ల ఆయన నిబద్ధత, కృషిని గుర్తించింది పార్టీ నాయకత్వం.ఈ ఏడాది ఆగస్టులో జర్మనీలోని భారతీయ సమాజానికి తొలి ప్రతినిధిగా గుర్దీప్ ఎన్నికయ్యారు.
సీడీయూ ద్వారా జర్మనీలోని ఏదైనా రాష్ట్ర ప్రెసిడియంలో భారతీయుడు నియమితులవ్వడం ఇదే తొలిసారి.గుర్దీప్ అంతకుముందు అమ్ట్ వాచెన్బర్గ్ కౌన్సిలర్‌గా, జిల్లా ఇల్మ్ నుంచి ప్రెసిడియం సభ్యునిగా ఎన్నికయ్యారు.
తొలి నుంచి భారతీయ సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఆయన.వారి సమస్యలను ఎప్పటికప్పుడు సీడీయూ నాయకత్వానికి తెలియజేస్తున్నారు.

సీడీయూలో తన నియామకంపై గుర్దీప్ రందవా స్పందించారు.జర్మన్ ఆర్ధిక వ్యవస్ధ , సమాజాన్ని నిర్మించడంలో భారతీయులు పోషించిన పాత్రకు గుర్తింపుగా తనకు ఈ గౌరవం దక్కిందన్నారు.ఆరోగ్యకరమైన ఇండో జర్మన్ సంబంధాలను నిర్మించడంలో దోహదపడేందుకు భారత సంతతికి చెందిన జర్మన్ యువకులు కృషి చేయాలని గుర్దీప్ పిలుపునిచ్చారు.







