మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.మత్స్యశాఖ పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగారు.
సంఘం అధ్యక్షుడు అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.తమకు న్యాయం చేయాలని సంఘం సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
అధికారులు స్పందించి తమకు సరైన న్యాయం చేయాలని, అప్పటివరకు ట్యాంక్ దిగబోయేది లేదని భీష్మించుకుని ఉన్నట్లు సమాచారం.రంగంలోకి దిగిన పోలీసులు సంఘం సభ్యులను కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు.







