రైతులు అప్రమత్తంగా ఉండాలి:అసిస్టెంట్ రిజిస్టర్ ఇందిరా

సూర్యాపేట జిల్లా:కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం తీసుకువచ్చిన రైతులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు పాటించాలని అసిస్టెంట్ రిజిస్టర్ ఇందిరా అన్నారు.బుధవారం కోదాడలోని తమ్మర వద్ద కోదాడ పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ ఆవుల రామారావుతో కలిసి ఆమె పరిశీలించి మాట్లాడారు.

 Farmers Should Be Vigilant: Assistant Register Indira-TeluguStop.com

రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని తేమ శాతం ఆధారంగా కొనుగోలు చేసి వెంటనే మిల్లులకు తరలించాలని అన్నారు.చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉంటూ టార్పాలిన్ పట్టాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.ధాన్యం విక్రయించిన రైతులకు ప్రభుత్వం వెంటనే నగదు జమ చేస్తున్నందున కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు ధాన్యంతో పాటు అన్ని రకాల ధ్రువపత్రాలు వెంట తీసుకొని రావాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఈఓ చాంద్ బి,సొసైటీ సిబ్బంది,రైతు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube