తెలంగాణలో సాధారణ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగా రేపు మధ్యాహ్నం లియోనియో రిసార్ట్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశం జరగనుంది.
ఈ భేటీలో కీలకమైన రాజకీయ తీర్మానాలకు రాష్ట్ర కార్యవర్గం ఆమోదం తెలపనుందని సమాచారం.తెలంగాణలో రానున్న ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా రాజకీయ తీర్మానాలు చేయనుంది బీజేపీ.
రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ తీర్మానించింది.కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం, ఉద్యమ కార్యాచరణపై తీర్మానం చేసింది.
సంస్థాగత బలోపేతంతో పాటు పార్లమెంట్ ప్రవాస యోజనపై కార్యవర్గ సమావేశంలో నేతలు చర్చించనున్నారు.అదేవిధంగా మునుగోడు ఉపఎన్నిక ఫలితం, భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.







