తెలుగులో బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.గత సీజన్ లతో పోల్చుకుంటే బిగ్ బాస్ సీజన్ 6 ఎంటర్టైన్మెంట్ మరొక రేంజ్ లో ఉంటుంది అనే బిగ్ బాస్ ప్రేమికులు ఆశించినప్పటికీ ఈసారి మాత్రం బిగ్ బాస్ హౌస్ చప్పగా సాగుతోంది.
అంతే కాకుండా గత సీజన్ లో ఎప్పుడు లేని విధంగా ఈసారి బిగ్ బాస్ గేట్లు తెరిచి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు బయటికి వెళ్లిపోండి అంటూ కంటెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ కంటెస్టెంట్లలో మాత్రం మార్పు రావడం లేదు.అయితే ఈ విషయంలో బిగ్ బాస్ లోకమా లేకపోతే కంటెస్టెంట్ లోపమా అన్నది మాత్రం అర్థం కావడం లేదు.
అయితే కంటెస్టెంట్స్ చాలా వరకు సేఫ్ గేమ్ ఆడుతున్నారని జెన్యూన్ గా ఆడటం లేదు అంటూ వాదోపవాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
మరీ ముఖ్యంగా మంచి మంచి కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తూ ముచ్చట్లు పెడుతూ టాస్కులను సరిగా ఆడని కంటెస్టెంట్ లను సేవ్ చేస్తున్నారంటూ నెటిజెన్స్ బిగ్ బాస్ షో పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా గత సీజన్ లో మాదిరిగా ఈసారి వైల్డ్ కార్డు ఎంట్రీలు, సీక్రెట్ రూమ్, గెస్ట్ అపీరియన్స్ లు ఇలా ఏమీ జరగకపోవడంతో రెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.హౌస్ లో మంచి కంటెస్టెంట్ లని ఎలిమినేట్ చేసి కన్నింగ్ కంటెస్టెంట్లని హౌజ్‌లో పెట్టుకుంటున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తాజాగా కంటెస్టెంట్ మెరీనా విషయంలో కూడా అదే జరిగింది అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా 11వ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి మెరీనా ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయిన విషయం తెలిసిందే.తక్కువ ఓట్లు వచ్చిన శ్రీ సత్య, మెరినా లలో శ్రీ సత్య సేవ్ అయిన విషయం తెలిసిందే.మెరీనా ఎలిమినేట్ అవ్వడంతో రోహిత్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు.
దీంతో హౌస్ లో కొందరు రోహిత్ ని చూసి ఎమోషనల్ అయ్యారు.ఇది ఇలా ఉంటే తాజాగా మెరీనా ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ షోపై,షో నిర్వాహకులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతున్నాయి.
శ్రీ సత్యని సేవ్ చేసి జెన్యూన్ పర్సన్ ఆయన మెరీనాని ఎలిమినేట్ చేశారు అంటూ పలువురి నెటిజెన్స్ విమర్శిస్తున్నారు.







