మెకానికల్ గా తయారైన ఈ దైనందిత జీవితంలో ఆరు నెలలకు ఒకసారైనా ఫ్యామిలీతో ఎక్కడికైనా టూర్ వెళ్లాలని అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికీ.అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏమంటే.
చాలామందికి ఎక్కడికి వెళ్లాలో తెలియక ఎప్పుడూ వెళ్లిన పాత ప్రదేశాలకు వెళ్తూ వుంటారు.టూరిజానికి మనదేశంలోనే అద్భుతమైన ప్రాంతాలున్నాయి.అలాంటి వాటిల్లో పాపులర్ ప్లేస్ ‘అలీబాగ్.‘ ఇక్కడ అందమైన బీచ్‌ల నడుమ అద్భుతమైన కోటలు కొలువుదీరాయి.ఇక్కడికి వెళ్తే కనీసం రెండు మూడు రోజులైనా గడపకుండా రాలేరు.
అలీబాగ్ ఎక్కడుందంటే, మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఉంది.
అక్కడికి వెళ్ళగానే అందమైన బీచ్‌లు, పురాతన కోటలు, వాటర్ స్పోర్ట్స్ లాంటివి దర్శనం ఇస్తూ ఉంటాయి.అందుకే దీన్ని మహారాష్ట్రలోని ‘మినీ గోవా’ అని కూడా పిలుస్తారు.
అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఇక్కడికి వెళ్ళడానికి బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు.అలీబాగ్‌లో ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్‌లు వున్నవి.
అందులో ‘కొలాబా’ ఒకటి.ఇది అలీబాగ్‌కి దాదాపు దాదాపు 2 కిలో మీటర్ల దూరంలో ఉంది.
![Telugu Alibaug, Journey, Passengers, Tourism, Tourist, Travel-Latest News - Telu Telugu Alibaug, Journey, Passengers, Tourism, Tourist, Travel-Latest News - Telu](https://telugustop.com/wp-content/uploads/2022/11/passengers-travel-travelling-tourism-tourist-Alibaug.jpg )
అలాగే ఇక్కడ చూడదగ్గ మరో విషయం “మురుద్ జంజీరా కోట.” మురుద్ జంజీరా కోట 17వ శతాబ్దం నాటిదాని ప్రతీతి.దీన్ని సిడి సిరుల్ ఖాన్ కట్టించాడు.ఈ కోటలో 6 ఏనుగులు ఒక అడవి పులిని పట్టుకున్నట్లు ఓ అద్భుతమైన శిల్పం ఒకటి ఉంటుంది.అది సిద్దీల ధైర్యానికి చిహ్నంగా భావిస్తారు.ఈ కట్టడంలో దాదాపు 40 అడుగుల పొడవున్న 23 భారీ మూలస్తంభాలు ఉన్నాయి.
ఈ కోట మురుద్ బీచ్ ఒడ్డున కలదు.ఆ బీచ్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.ఇక దీని తరువాత చెప్పుకోదగ్గ ప్లేస్ “బ్రహ్మ కుండ్.” ఇది అలీబాగ్‌లో చూడదగ్గ ప్లేస్ల్లో ముఖ్యమైనది.1612లో కట్టిన దీన్ని పవిత్రమైన ప్రదేశంగా చూస్తారు.కాబట్టి మీరు ఎపుడైనా మీ ఫ్యామిలీతో వెళ్లాలంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు.