ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది.రాగల 48 గంటల్లో తమిళనాడు – దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ ప్రభావంతో రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడకక్కడ భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొంది.అదేవిధంగా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడిం చింది.
దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం మత్స్యకారులు ఎల్లుండి వరకు వేటకు వెళ్లొద్దని సూచించింది.







