Anitha chowdhary srikanth : ఛత్రపతిలో నటికి హీరో శ్రీకాంత్ కు మధ్య ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?

తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ అనితా చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అనితా చౌదరి పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు సన్నివేశం చత్రపతి సినిమాలోని సూరీడు అనే డైలాగ్ తో భారీగా ఫేమస్ అయ్యింది అని చౌదరి.

 Relation Between Srikanth And Anitha Srikanth, Anitha Chowdhary, Tollywood, Rel-TeluguStop.com

అయితే యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనితా చౌదరి ఆ తర్వాత నటిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.అనితా చౌదరి ఎన్నో షోలకు యాంకర్ గా వ్యవహరించి తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది.

ఒక స్టార్ యాంకర్ గా ఉన్న సమయంలోనే ఆమెకు బుల్లితెరపై సీరియల్స్ లో నటించే అవకాశం రావడంతో సీరియల్స్ లో కూడా నటించి మెప్పించింది అనితా చౌదరి.

అలా బుల్లితెరపై కస్తూరి,ఋతురాగాలు,నాన్న వంటి మంచి మంచి సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తర్వాత సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటూ వెండితెరపై ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది.ఇకపోతే ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా నటించిన తాళి సినిమాలో అనితా చౌదరికి నటించే అవకాశం వచ్చినప్పటికీ రాజమండ్రిలో ఆరు నెలలు షూటింగ్ ఉంటుంది అని చెప్పగా యాంకర్ వృత్తికి దూరం అవ్వాల్సి వస్తుంది అని ఆ అవకాశాన్ని వదులుకుందట.

ఇక తర్వాత ఈమె తెలుగులో మురారి,సంతోషం, ఉయ్యాల జంపాల,మన్మధుడు, నువ్వే నువ్వే ఇలా ఎన్నో మంచి మంచి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Telugu Anchor, Srikanth, Tollywood-Movie

ఇకపోతే ఈమె 2005 జూన్ 18న కృష్ణ చైతన్య ను పెళ్లి చేసుకుంది.అయితే ఈ కృష్ణ చైతన్య మరెవరో కాదు హీరో శ్రీకాంత్ కజిన్.శ్రీకాంత్ కి దగ్గర బంధువు అయినా కృష్ణ చైతన్యను అనితా చౌదరి పెళ్లి చేసుకుంది.

వీరికి ఒక బాబు కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.ఇకపోతే ఇప్పటికీ ఈమె సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మెప్పిస్తూ వస్తోంది.

అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టిన అనితా చౌదరి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ మంచి మంచి సందేశాలను ఇస్తోంది.అంతే కాకుండా తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫిట్నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది అనితా చౌదరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube