మలయాళం లో సూపర్ హిట్ అయిన దృశ్యం 2 సినిమా ను హిందీ లో అదే టైటిల్ తో రీమేక్ చేశారు.అజయ్ దేవగన్ హీరో గా శ్రియ హీరోయిన్ గా టబు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ మధ్య కాలం లో హిందీ లో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి.వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా లు కూడా కనీసం పాతిక నుండి 40.50 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కూడా రాబట్టలేక పోతున్నాయి.ఈ నేపథ్యం లో దృశ్యం 2 సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ నమోదు చేస్తుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే తెలుగు మరియు మలయాళంలో వచ్చిన దృశ్యం 2 మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.హిందీ లో కూడా దృశ్యం 2 భారీ విజయాన్ని నమోదు చేయడంతో పాటు మంచి కలెక్షన్స్ నమోదు చేయడం జరిగింది.
అందుకే దృశ్యం 2 కచ్చితంగా ఒక రేంజ్ లో వసూలను నమోదు చేస్తుంది అని అంతా భావిస్తున్నారు.

ఈ సమయంలో విడుదలైన దృశ్యం 2 సినిమా మొదటి రోజు ఏకంగా 10 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.భారీ ఎత్తున సినిమా ను ఉత్తర భారతం లో విడుదల చేశారు.ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు రాకపోవడం వచ్చిన సినిమా లు నిరాశ పరచడంతో ఈ సినిమా పై హిందీ ప్రేక్షకులు చాలా ఆసక్తిని కనబరుచుతున్నారు.
ఈ సినిమా మినిమం హిట్ టాక్ దక్కించుకున్నా కూడా కచ్చితంగా మంచి కలెక్షన్స్ నమోదు చేసుకుంటుందని అంతా భావించారు.అనుకున్నట్లుగానే దృశ్యం 2 సినిమా యొక్క ఓపెనింగ్ కలెక్షన్స్ డీసెంట్ గా ఉన్నాయంటూ హిందీ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
సౌత్ లో సక్సెస్ అయినట్లుగానే నార్త్ లో కూడా దృశ్యం 2 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నట్లే అంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.ఒకే సినిమా ఇలా అన్ని భాషల్లో సక్సెస్ అవ్వడం చాలా చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం.
అది కేవలం దృశ్యం కే సాధ్యం అయ్యింది.







