Mahesh Babu Ramesh Babu: సోదరుడు రమేష్ బాబు పిల్లలతో మహేష్.. పిక్స్ వైరల్!

సినీ దిగ్గజం సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో టాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.మహా శిఖరం అస్తమించింది.

 Mahesh Babu With Ramesh Babu Ghattamaneni Family, Krishna, Super Star Krishna, M-TeluguStop.com

కృష్ణ గారి మరణ వార్త వినడం వరల్డ్ వైడ్ గా ఉన్న తెలుగు ప్రేక్షకులు జీర్ణించు కోలేక పోతున్నారు.సూపర్ స్టార్ కృష్ణ గారు ఇక లేరు అనే వార్త అందరిని దిగ్బ్రాంతి కి గురి చేసింది.

ఈయన లేరు అనే లోటు టాలీవుడ్ సినీ పరిశ్రమకు కూడా పెద్ద లోటుగానే మిగిలిపోనుంది.

ఇక తండ్రి మరణంతో మహేష్ బాబు కూడా తీవ్ర దుఃఖంలో మునిగి పోయారు.

మంగళవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో కృష్ణ తుదిశ్వాస విడిచారు.ఈయన మరణంతో మహేష్ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం చుసిన వారికీ కూడా దుఃఖం ఆగలేదు.

ఇక కృష్ణ గారు మరణించి మూడు రోజులు అవుతున్న నేపథ్యంలో మూడవరోజు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమాల్లో ఘట్టమనేని కుటుంబం మొత్తం పాల్గొన్నారు.

అలాగే సినీ ప్రముఖులతో పాటు కొంత మంది ఘట్టమనేని ఫ్యాన్స్ కూడా విచ్చేసి తమ ప్రియమైన హీరో సూపర్ స్టార్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో దివంగత నటుడు మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కుటుంబం కూడా విచ్చేసారు.

Telugu Krishna, Mahesh Babu, Maheshbabu, Ramesh Babu, Rameshbabu-Movie

ఈ కార్యక్రమం లో రమేష్ బాబు భార్య, కుమారుడు, కుమార్తె విచ్చేయగా వీరితో మహేష్ బాబు దిగిన ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.ఈ ఫోటోలు ప్రత్యేకంగా నిలిచాయి.ఇదిలా ఉండగా రమేష్ బాబు ఈ ఏడాది మొదట్లోనే మరణించిన విషయం తెలిసిందే.అప్పుడు కూడా మహేష్ బాబు చాలా ఆవేదన చెందారు.ఆయన ను కడసారి చూసేందుకు కూడా లేకపోవడంతో మరింత దుఃఖంలో మునిగిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube