టీడీపీ అధినేత చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరవని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.ఇప్పటికైనా చివరి ఎన్నికలని తెలుసుకోవడం గమనార్హమని వ్యాఖ్యనించారు.
వీధి రౌడీలు కూడా మాట్లాడనటువంటి మాటలను చంద్రబాబు జగన్ ను ఉద్దేశించి అంటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగానే చంద్రబాబు కర్నూలులో పర్యటిస్తున్నారని విమర్శించారు.
కర్నూలులో హైకోర్టు పెట్టేందుకు చంద్రబాబు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు.రాష్ట్రం అభివృద్ధి చెందడం ఆయనకు ఇష్టం లేదని ఆరోపించారు.
అధికారం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారన్నారు.అయితే చంద్రబాబు డ్రామాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని వెల్లడించారు.







