సినీ దిగ్గజం సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో రేపు ఆయనకు నివాళి అర్పిస్తూ షోలు రద్దు చేయాలని.షూటింగ్స్ కూడా బంద్ చేయాలనీ నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది.
ఇది ఆయనకు ఇస్తున్న రెస్పెక్ట్ అనే చెప్పాలి.ఈయన సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలకు గాను ఇప్పుడు అభిమానం చూపించడం నిజంగా మెచ్చుకోదగిన విషయమే అని చెప్పాలి.
మన ఇండస్ట్రీలోని మహా శిఖరం అస్తమించింది.కృష్ణ గారి మరణ వార్త వినడం తెలుగు ప్రేక్షకులు జీర్ణించు కోలేక పోతున్నారు.సూపర్ స్టార్ కృష్ణ గారు ఇక లేరు అనే వార్త పలువురిని దిగ్బ్రాంతికి గురి చేసింది.ఈయన లేరు అనే లోటు టాలీవుడ్ సినీ పరిశ్రమకు కూడా పెద్ద లోటుగానే మిగిలిపోనుంది.
తండ్రి మరణంతో మహేష్ బాబు కూడా తీవ్ర దుఃఖంలో మునిగి పోయారు.
కృష్ణ మరణానికి సంతాపం తెలుపుతూ టాలీవుడ్ సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
కొంత మంది ప్రముఖులు ఆయనను సందర్శించి మహేష్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ విచార ఘనతకు నివాళులు అర్పిస్తూ ఆయనకు నిర్మాత మండలి కూడా సంతాపం తెలుపుతుంది.

ఎక్కడో మొదలుపెట్టిన ఆయన సినీ ప్రస్థానం సూపర్ స్టార్ గా కోట్ల హృదయాలను గెలుచుకున్నారు.మరి అంతటి మహా మనిషి మరణించడంతో తెలుగు రాష్ట్రాల్లో దిగ్బ్రాంతికి గురి అయ్యారు.అందుకే ఈయన ఆకస్మిక మృతికి సంతాపం తెలుపుతూ రేపు ఏపీ అంతటా ఉదయం ఆటను రద్దు చేస్తున్నట్టు థియేటర్ల యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.అలాగే రేపు మొత్తం షూటింగ్స్ కూడా లేవని నిర్మాత మండలి నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయం విని ఘట్టమనేని అభిమానులే కాదు.సినీ ప్రేక్షకులు కూడా ఈయనకు దక్కిన గౌరవం అని వారిని మెచ్చుకుంటున్నారు.







