Rajeev kanakala Suma : రాజీవ్ కనకాల సుమ కనకాల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

బుల్లితెరపై సుమ కనకాల నంబర్ వన్ యాంకర్ గా కెరీర్ ను కొనసాగిస్తుండగా సుమకు ఆఫర్లు తగ్గుతున్నా ఆమె స్థాయిలో రాణించే మరో యాంకర్ లేకపోవడం ఆమె కెరీర్ కు ప్లస్ అవుతోంది.ప్రీ రిలీజ్ ఈవెంట్లకు ఎక్కువగానే ప్రాధాన్యత ఇస్తున్న సుమ కొత్త షోలకు మాత్రం నో చెబుతున్నారు.

 Age Gap Between Suma And Rajeev Kanakala Details Here Goes Viral , Rajeev Kana-TeluguStop.com

యాంకర్ గా కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన సుమ సంపాదించిన డబ్బును పెట్టుబడులు పెట్టే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సుమ కనకాల భర్త రాజీవ్ కనకాల ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

అయితే రాజీవ్ కనకాల టాలెంట్ కు తగిన స్థాయిలో సినీ ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు అయితే రాలేదు.సుమ సైతం ఒక సందర్భంలో తన భర్తకు వస్తున్న సినిమా ఆఫర్ల విషయంలో ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేశారు.

మరోవైపు రాజీవ్ కనకాల సైతం పలు సందర్భాల్లో తన కంటే సుమ ఎక్కువ మొత్తంలో సంపాదిస్తున్నారని చెప్పిన సంగతి తెలిసిందే.

సుమ, రాజీవ్ కనకాల ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి తర్వాతే సుమకు కలిసొచ్చిందని చాలామంది భావిస్తారు.సుమ యాంకర్ గా చేసిన అవాక్కయ్యారా షో హిట్ కావడంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

అయితే రాజీవ్ కనకాల సుమ మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగానే ఉంది.రాజీవ్ కనకాల వయస్సు ప్రస్తుతం 53 సంవత్సరాలు కాగా సుమ వయస్సు ప్రస్తుతం 47 సంవత్సరాలు కావడం గమనార్హం.

Telugu Agegap, Rajeev Kanakala, Suma, Suma Kanakala-Movie

రాజీవ్ కనకాల సుమ మధ్య ఆరు సంవత్సరాల గ్యాప్ ఉందని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.సిల్వర్ స్క్రీన్ పై సుమ రాజీవ్ కనకాల కలిసి నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఆ కోరిక ఎప్పటికి తీరుతుందో చూడాల్సి ఉంది.రాజీవ్ సుమ విడాకుల గురించి కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తల్లో నిజం లేదని సుమ రాజీవ్ పరోక్షంగా స్పష్టతనిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube