Director Nag Ashwin: సినిమా చేయడం అంటే మనిషి పుట్టుకతో సమానం.. సినిమాలపై డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగ్ అశ్విన్ తాజాగా చెడ్డి గ్యాంగ్ తమాషా అనే సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.అబుజా ఎంటర్టైన్మెంట్స్, శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ కళ్యాణ్ హీరోగా  నటిస్తున్న టీజర్ లాంచ్ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది.

 Director Nag Ashwin Shocking Comments On Movies Details, Director Nag Ashwin, Na-TeluguStop.com

ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడితే సినిమాలు పెద్ద సినిమానా చిన్న సినిమానా అనే తేడాలు ఏమాత్రం ఉండవని తెలిపారు.

సినిమాలు కంటెంట్ ఉంటే తప్పకుండా ఆ సినిమా సక్సెస్ సాధిస్తుందని ఈయన తెలిపారు.చెడ్డి గ్యాంగ్ తమాషా టీజర్ ఎంతో అద్భుతంగా ఉందని తెలిపారు.ఒక సినిమాని విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ఎంతగా శ్రమిస్తారో ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు.ఒక సినిమా చేసి విడుదల చేయడం అంటే మనిషి పుట్టుకతో సమానమని తెలిపారు.

ఇక తల్లి గర్భంలో తన బిడ్డను మోసి కనడానికి ఎంత కష్టపడుతుందో సినిమా కూడా చేయడం అంతే కష్టంగా ఉంటుందని తెలిపారు.

ఇక సినిమా టీజర్ గురించి మాట్లాడుతూ.

Telugu Cheddigang, Nag Ashwin, Venkat Kalyan, Prabhas, Project-Movie

ఈ సినిమా టీజర్ చూస్తుంటే నాకు యంగ్ టీం తో మేము చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం గుర్తుకొస్తుందని ఆ సినిమా అందుకున్న విధంగానే ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా చిత్ర బృందానికి నాగ్ అశ్విన్ ఆల్ ద బెస్ట్ తెలియజేసారు.ఇకపోతే నాగ్ అశ్విని ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్టు కే సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసింది.ఇప్పటికే ఈ సినిమా పలు షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube