‘కూ’ యాప్ గురించి వినే వుంటారు.వినడమేమిటి.
ఇపుడు భారతదేశంలో ట్విట్టర్ కి పోటీగా ఎదుగుతున్న సోషల్ మెసేజింగ్ యాప్ ఇది.ఇండియన్ మైక్రో బ్లాగింగ్ గా పేరుతెచ్చుకున్న కూ యాప్ తాజాగా 4 కొత్త ఫీచర్లను లాంచ్ చేసింది.ఈ కొత్త ఫీచర్ల విషయానికొస్తే ప్రొఫైల్ ఫోటోలను అప్‌లోడ్ చేయడం, కూ పోస్ట్‌లను షెడ్యూల్ చేయడం, కూ పోస్ట్‌లను సేవ్ చేయడం, డ్రాఫ్ట్‌లను సేవ్ చేయడం వంటివి ఇకనుండి యాడ్ కానున్నాయి.ఇకపోతే కూ యాప్ తాజాగా 50 మిలియన్ డౌన్‌లోడ్‌లను సంపాదించి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మైక్రో బ్లాగింగ్ సైట్‌గా అవతరించింది.
ముందుగా మొదటి ఫీచర్ ప్రొఫైల్ ఫోటోల విషయానికొస్తే, యూజర్లు నేటినుండి గరిష్టంగా 10 ప్రొఫైల్ ఫోటోలను అప్‌లోడ్ చేసుకోవచ్చు.ఎవరైనా యూజర్ తమకిష్టమైన ప్రొఫైల్‌ని చూసినప్పుడు, ఈ ఫోటోలు ఆటోమేటిక్ గా ప్లే కాబడతాయి.
డ్రాగ్ అండ్ డ్రాప్ ఫంక్షన్‌తో ఈ ఫోటోల ఆర్డర్ మార్చడం కూడా చాలా సులభం.ఇక రెండవది షెడ్యూలింగ్ చేయడం.
పవర్ క్రియేటర్స్ వంటి మీడియా సంస్థలు ఇప్పుడు కూని కూడా షెడ్యూల్ చేయవచ్చు.మల్టీ కంటెంట్‌ను షేర్ చేయాలనుకునేటప్పుడు మీకు నచ్చిన సమయానికి పోస్ట్ పెట్టి షెడ్యూల్ చేయొచ్చు.

ఇందులో మూడవది, డ్రాఫ్ట్ సేవ్.డ్రాఫ్ట్‌ను పోస్ట్ చేయడానికి ముందు దాన్ని ఎడిట్ చేయాలనుకునే క్రియేటర్‌లు డ్రాఫ్ట్ సేవ్ ఫంక్షన్‌ను తమకు నచ్చిన విధంగా వాడుకోవచ్చు.ఇక ఆఖరిది.కూ సేవ్.యూజర్లు ఇప్పుడు లైక్, కామెంట్, రీ-కు లేదా షేర్ వంటి సాధారణ చర్యలకు బదులుగా కూ పోస్ట్‌ను సేవ్ చేసుకొనే వెసులుబాటు కలదు.ఇవి సేవ్ చేసిన కూలు యూజర్లకు మాత్రమే కనిపిస్తాయి.
ఈ కొత్త ఫీచర్ల లాంచ్ పై కూ యాప్ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదవత్కా తాజాగా మాట్లాడుతూ, కూ పోస్ట్‌లను షెడ్యూల్ చేయడాన్ని మేము చాలా సులభతరం చేసాము, వినియోగించుకోండి! అని తెలిపారు.







