పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కడియద్ద గ్రామంలో ఓ బాణాసంచా కర్మాగారంలో గురువారం రాత్రి జరిగిన విస్ఫోటనంలో ముగ్గురు మృతి చెందడం తెలిసిందే. దీంతో మృతి చెందిన యాళ్ళ ప్రసాద్, దూళ్ళ నాని, దెయ్యాల స్వామీలకు… తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.
యాళ్ళ ప్రసాద్ మృతదేహం తప్ప మిగతా ఇద్దరి మృతదేహాలు.చిద్రం అయ్యాయి.
ఇదే ప్రమాద ఘటనలో సొలోమోను రాజ్ ప్రమాదానికి గురికావడంతో అతని పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది.ఈ ప్రమాద ఘటానికి నిర్లక్ష్య ధోరణి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రాంతంలో అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు చెబుతున్న గాని.నిబంధనల అతిక్రమణనీ గుర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారంటున్నారు.
కేవలం 15 కేజీల మేర పేలుడు పదార్థాలను తయారు చేసేందుకు అనుమతి పొందిన అన్నవరం… 100 కేజీలకు పైగా ఎలా తయారు చేశాడనేది స్థానికుల ప్రశ్న.పైగా ఇక్కడ సరైన మార్గం లేకపోవడంతో ఫైర్ ఇంజన్ మరియు అంబులెన్స్ లు సకాలంలో రాలేకపోయాయి అంటూ స్థానికులు… ఈ ప్రమాద ఘటనపై మండిపడ్డారు.