తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం నిర్లక్ష్యంతో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు.ఈ క్రమంలో బీసీ జనగణన జరగాలని, రిజర్వేషన్లు పెంచాలని తెలిపారు.
క్రిమిలేయర్ వలన బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు.బీసీ జనగణన చేయకపోతే ప్రధాని మోదీపై తిరుగుబాటు తప్పదని వీహెచ్ హెచ్చరించారు.
గవర్నర్ తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.ఇందుకు గానూ ఆధారాలు ఉంటే కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేయాలని సూచించారు.
గవర్నర్ నిస్సహాయత చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.







