టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏం పిల్లో ఏం పిల్లడో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి ప్రణీత సుభాష్.ఇలా తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమెకు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు వచ్చింది.
ఈ విధంగా తెలుగు కన్నడ హిందీ భాషలలో పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో బిజీగా గడిపినటువంటి ఈమె 2021 సంవత్సరంలో బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజు అనే వ్యక్తిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.ఇలా పెళ్లయిన కొన్ని నెలలకే తాను ప్రెగ్నెంట్ అని తెలియజేస్తూ తన బేబీ బంప్ ఫోటోషూట్లతో అభిమానులను సందడి చేశారు.
ఇకపోతే గత కొన్ని నెలల క్రితం ప్రణీత కూతురికి జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.అయితే ఇప్పటికే ఈమె తన కూతురి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటికీ తన ఫేస్ కనపడకుండా షేర్ చేశారు.
కానీ మొదటిసారి తన కూతురి ఫేసును చూపిస్తూ సోషల్ మీడియా వేదికగా తన పాపాయి ఫోటోలను షేర్ చేయడంతో ఒకసారిగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ క్రమంలోనే ఈ ఫోటోలు చూసిన నేటిజెన్లు పెద్ద ఎత్తున తన కూతురు ఎంతో ముద్దుగా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు అందంలో తల్లి కూతుర్లు ఇద్దరు పోటీ పడుతున్నారు అంటూ ప్రణీత కూతురి ఫోటో పై కామెంట్ చేశారు.ప్రస్తుతం ప్రణీత కుమార్తె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక సినిమాలకు ఈమె దూరంగా ఉన్నప్పటికీ సినిమాలకు సంబంధించిన అన్ని విషయాల గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు.







