Telegram video messeges : యూజర్లకు టెలిగ్రామ్ గుడ్ న్యూస్.. అందుబాటులోకి సరికొత్త ఫీచర్లు

స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఇష్టమైన యాప్‌లలో టెలిగ్రామ్ కూడా ఒకటి.వాట్సాప్ తరహాలోనే ఇది కూడా ఎక్కువ మంది యూజర్లను ఆకట్టుకుంటోంది.

 Telegram Good News For Users.. New Features Available Telegram, Account, Login,-TeluguStop.com

తాజాగా యూజర్లకు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.టెలిగ్రామ్ ఇటీవల తన అధికారిక బ్లాగును అప్‌డేట్ చేసి, ప్రీమియం వినియోగదారులు కొన్ని కొత్త ఫీచర్‌లను అందించింది.

అంతేకాకుండా వినియోగదారులందరికీ అవసరమైన కొన్ని మార్పులను యాప్‌లో అదనంగా చేర్చింది.వీడియో సందేశాల కోసం వాయిస్-టు-టెక్స్ట్ కన్వర్షన్ ఫీచర్ ప్రీమియం యూజర్లకు అందుబాటులోకి తీసుకు రావడంతో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

దీంతో పాటు కొన్ని చిన్న డిజైన్ మార్పులతో యాప్‌ను ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

టెలిగ్రామ్ ప్రీమియం సభ్యులకు ప్రత్యేక సేవలు ప్రారంభించినప్పటి నుండి ఏదైనా వాయిస్ సందేశాన్ని టెక్స్ట్‌గా మార్చే సౌలభ్యం ఉంది.ఈ ఫీచర్ క్లిప్‌ను వినడం కంటే, అందుకున్న వాయిస్ మెసేజ్‌ను చదవడానికి యూజర్లకు సహాయపడుతుంది.

ఇప్పుడు, ఈ ఫీచర్ వీడియో సందేశాలకు కూడా అందుబాటులో ఉంది.టెలిగ్రామ్ ప్రీమియం యూజర్లు వీడియో మెసేజ్‌లను టెక్స్ట్ మెసేజ్‌లుగా మార్చే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది.

దీంతో పాటు ఒక్కో గ్రూపులో 200ల మంది ఉండేలా అవకాశం కల్పించింది.వీడియో మెసేజ్‌ల కోసం వాయిస్-టు-టెక్స్ట్‌కి అప్‌డేట్ చేయడం వల్ల వీడియో మెసేజ్‌లకు, ప్రీమియం యూజర్‌లు టెక్స్ట్ ట్రాన్‌స్క్రిప్ట్‌ను పొందడానికి ఉపయోగపడుతుంది.

Telugu Login, Ups, Text, Messeges-Latest News - Telugu

iOS యూజర్ల కోసం డార్క్ థీమ్‌లు అప్‌డేట్ చేయబడ్డాయి.చాట్‌లు, చాట్ లిస్ట్‌లో స్క్రోల్ చేస్తున్నప్పుడు మంచి బ్లర్రింగ్ ఎఫెక్ట్‌లతో రంగులు మరింత బ్యాలెన్స్‌గా ఉంటాయి.ఆండ్రాయిడ్‌లోని చాట్ సెట్టింగ్‌లలో టెక్స్ట్ పరిమాణాన్ని మార్చడం వలన ఇప్పుడు లింక్ ప్రివ్యూలు, రిప్లై హెడర్‌లతో సహా అన్ని చాట్ టెక్స్ట్ పరిమాణం పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube