BiggBos Srihan : ఎటకారం ఎక్కువవుతుంది శ్రీహాన్..!

బిగ్ బాస్ సీజన్ 6 లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ గా వచ్చాడు శ్రీహాన్.లాస్ట్ సీజన్ లో సిరిని కోసం వీకెండ్ ఎపిసోడ్ లో వచ్చి తన పాటతో బిగ్ బాస్ ఆడియన్స్ ని మెప్పించిన శ్రీహాన్ సీజన్ 6 లో కంటెస్టంట్ గా వచ్చాడు.

 Srihan Over Action In Biggboss House With Inaya And Keerthi Shetty , Keerthi She-TeluguStop.com

సిరికి ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ కి శ్రీహాన్ కొద్దిపాటి గేం ఆడినా సరే టాప్ 5 పక్కా ఇక మనోడి క్యారక్టర్ ని బట్టి టైటిల్ విజేత అవుతాడా లేదా అన్నది తెలుస్తుంది.అయితే శ్రీహాన్ ఆట వరకు బాగానే ఉన్నా హౌస్ లో తనంటే పడని ఇనయా, కీర్తి శెట్టిల మీద కొద్దిగా ఎక్కువ చేస్తున్నాడని అర్ధమవుతుంది.

వాళ్లతో మాట్లాడేటప్పుడు శ్రీహాన్ చేస్తున్న వెటకారం అతిలా అనిపిస్తుంది.లాస్ట్ సీజన్ లో సన్నీ లా ఇలా చేస్తే బయట ఆడియన్స్ తనకు ఫిదా అవుతారని అనుకున్నాడో ఏమో కానీ ఇక్కడ అతనికి అర్ధం కానీ మ్యాటర్ ఏంటంటే ఈ ఎటకారం వల్ల అతనికే బ్యాడ్ మార్క్ పడుతుంది.

ఇనయా, కీర్తిల నామినేషన్స్ లో కూడా శ్రీహాన్ కొద్దిగా ఓవర్ చేస్తున్నాడు అన్న టాక్ ఉంది.ఇద్దరు ఫీమేల్ కంటెస్టంట్స్ ని అలా తన ఎటకారం తో మాట్లాడటం ఏమి బాగాలేదని చెప్పొచ్చు.

అయితే ఆటలో ఇవన్ని సహజమే అయినా శ్రీహాన్ ఒక వారంతో ఇది ఫినిష్ చేయకుండా వారిని పదే పదే ప్రతివారం అలానే ఎగతాళి చేసేలా మాట్లాడటం ఆడియన్స్ కి హెడేక్ గా మారింది.ఈ విషయంలో శ్రీహాన్ జాగ్రత్తపడితే బెటర్ లేదంటే గీతు లానే అతన్ని కూడా ఎలిమినేట్ చేసినా చేస్తారు ఆడియన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube