ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర రాజధానికి సంబంధించి అమరావతికే మా మద్దతు అని స్పష్టం చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు ఇచ్చిన సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక మాట మార్చి మూడు రాజధానులు అని ఎందుకు అంటున్నారో.ప్రజలే ప్రశ్నించాలని కోరారు.
స్టీల్ ప్లాంట్ నీ అదానికి అమ్మేసిన వారిని ప్రశ్నించాలని కోరారు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ తీసుకున్నారని మీడియాతో తెలిపారు.
రాష్ట్ర రాజధానిపై ఇప్పటికే తమ వైఖరి స్పష్టంగా చెప్పామని… మూడు రాజధానులు అంటున్న వాళ్లని ప్రశ్నించకుండా ఒక రాజధాని అంటున్న మమ్మల్ని ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నారు అంటూ మీడియాపై సోము వీర్రాజు అసహనం వ్యక్తం చేశారు.
విశాఖ అభివృద్ధిపై ప్రధాని మోడీ దృష్టి సారించారని ఈనెల 12 వ తారీఖున ఏపీ బీజేపీ నేతలతో మోడీ సమావేశం అవుతారని సోము వీర్రాజు వెల్లడించారు.
కాగా ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు.ఈ పర్యటనలో పదివేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపన… ప్రారంభోత్సవం చేయనున్నారు.11వ తారీకు సాయంత్రం 6:25 నిమిషాలకు మోడీ విశాఖ చేరుకుంటారు.12వ తారీకు ఆంధ్ర యూనివర్సిటీ నార్త్ క్యాంపస్ గ్రౌండ్స్ లో రెండు లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాట్లకు అధికారులు రెడీ అవుతున్నట్లు సమాచారం.ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఐదువేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.