Elon Musk Twitter : ఆ ట్విట్టర్ అకౌంట్లపై మస్క్ కొరడా.. ఇకపై అలా చేయాల్సిందే!

ప్రముఖ పారిశ్రామికవేత్త, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విట్టర్ విషయంలో తీసుకునే నిర్ణయాలు చాలామందిని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి.తన సొంత అకౌంట్ నుంచే మస్క్ కొత్త ట్విటర్ రూల్స్‌ జారీ చేస్తున్నారు.

 Musk Whips On Those Twitter Accounts ,twitter , Elon Musk , Parody Accounts , Tw-TeluguStop.com

బ్లూటిక్ పెయిడ్ ఫీచర్ అవుతుందని ఎప్పటినుంచో చెబుతూనే వస్తున్నారు.కాగా ఇప్పుడు ఫేక్ లేదా సెలబ్రిటీల అకౌంట్స్‌ని ఇమిటేట్ చేసే అకౌంట్స్ కి కచ్చితంగా ‘పేరడీ‘ ట్యాగ్ ఉండాలని ఒక రూల్ తీసుకొచ్చారు.

పేరడీ అని స్పష్టంగా ప్రకటించకుండా ఒక సెలబ్రిటీ ఐడీతో తప్పుడు ట్వీట్స్‌ చేస్తే ఏ ట్విటర్ హ్యాండిల్ అయినా శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని మస్క్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.ఈ రూల్‌కి కట్టుబడి ఉండకపోతే ఇబ్బంది పడేదే మీరేనన్నట్లు ఆయన యూజర్లకు వార్నింగ్ లాంటిది ఇచ్చారు.

మస్క్ ట్వీట్ చేస్తూ, “గతంలో మేం సస్పెన్షన్‌కు ముందు హెచ్చరిక జారీ చేశాం, కానీ ఇప్పుడు మేం వరల్డ్ వైడ్ గా వెరిఫికేషన్‌ను రూపొందిస్తున్నాం.కాబట్టి పేరడీ అకౌంట్లను తొలగించడంలో ఎలాంటి హెచ్చరిక ఉండదు.” గతంలో మస్క్ ట్వీట్ చేస్తూ.“కామెడీ ఇప్పుడు ట్విట్టర్‌లో చట్టబద్ధం” అని పేర్కొన్నారు.అదే విషయాన్ని ఇప్పుడు అతను నిజం చేస్తున్నారు.

Telugu Elon Musk, Teslaceo-Latest News - Telugu

మస్క్ ప్రకారం, ట్విట్టర్ కొందరు సభ్యులతో కూడిన కంటెంట్ మానిటరింగ్ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తుంది.మస్క్ ప్రకారం, ట్విట్టర్ బ్లూలో చేరడానికి ఇది ఒక ఆవశ్యకతగా స్పష్టంగా కనిపిస్తుంది.ఏదైనా పేరు మార్పు చేస్తే ఆ అకౌంట్ వెరిఫికేషన్ చెక్‌మార్క్‌ను తాత్కాలికంగా కోల్పోతుందని కూడా జోడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube