అనకాపల్లి జిల్లాలోని కూరగాయల మార్కెట్ లో అగ్నిప్రమాదం సంభవించింది.మార్కెట్ లోని ఓ హోల్ సేల్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అనంతరం పక్కనే ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ కు మంటలు వ్యాపించాయి.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
అయితే ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిలినట్లు సమాచారం.ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.







