కర్నూలుకు సీబీఐ కోర్టు తరలింపు ప్రక్రియ పూర్తి అయింది.విశాఖపట్నం నుంచి సీబీఐ కోర్టు కర్నూలుకు సీబీఐ కోర్టు తరలిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో నేటి నుంచి సీబీఐ కోర్టు విధులు ప్రారంభమైయ్యాయి.ఇప్పటికే హెచ్ఆర్సీ, లోకాయుక్త, వక్ఫ్ బోర్డు, ట్రిబ్యునల్ కోర్టుకు కర్నూలుకు వచ్చేశాయి.
ఈ మేరకు జ్యుడీషియల్ అకాడమీకి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది.దీంతో రాయలసీమ పరిధిలోకి నాలుగు జిల్లాల కేసులు సీబీఐ కోర్టు పరిధిలోకి రానున్నాయి.
అయితే సీమ పరిధిలో 28 కేసులున్నట్లు తెలుస్తోంది.







