తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా కొనసాగుతూ ఎంతో ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.కెరియర్ మొదట్లో ఈయన పలు సినిమాలలో హీరోలకు తమ్ముడి పాత్రలలో నటించి సందడి చేశారు.
అనంతరం హీరోగా అవకాశాలను అందుకొని హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఇకపోతే తాజాగా ఈయన ఒకే ఒక జీవితం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమాతో ఎంతో మంచి హిట్ అందుకున్న శర్వానంద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తాను జాను సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురైన సంఘటనను గుర్తు చేసుకొని ఆ విషయాన్ని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
జాను మూవీ సినిమా షూటింగ్ సమయంలో తాను ప్రమాదానికి గురయ్యానని తెలిపారు.ఈ సినిమాలో లైఫ్ ఆఫ్ రామ్ అనే పాటను చిత్రీకరించే సమయంలో తాను స్కై డైవింగ్ చేయాల్సి ఉందని తెలిపారు.
శిక్షణ కూడా తీసుకున్నానని తెలిపారు.15 అడుగుల ఎత్తులో ఉన్న విమానం నుంచి ఒక్కసారిగా కిందకు దూకేశాను అయితే పారాషూట్ ఓపెన్ కాకపోవడంతో తాను కింద పడ్డానని ఆ సమయంలో తీవ్రమైన గాయాలు అయ్యాయని శర్వానంద్ అప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.ఇలా విమానంలో నుంచి కింద పడగానే తన చేతికి రెండు ప్లేట్లు వేసే 24నట్లు బిగించారని కాలికి కూడా ఒక ప్లేట్ బిగించారంటూ ఈయన తెలిపారు.ఇలా ఈ ప్రమాదం నుంచి తాను కోల్పోవడానికి సుమారురెండున్నర సంవత్సరాల పాటు సమయం పట్టింది అంటూ ఈ సందర్భంగా శర్వానంద్ అప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.