కొన్ని కొన్ని సార్లు ఇండస్ట్రీకి చెందిన నటీనటులు వచ్చిన అవకాశాలను ఇట్టాగే వదిలేస్తారు.తీరా ఆ సినిమాలు మంచి సక్సెస్ అందుకున్న తర్వాత బాధపడతారు.
చాలా వరకు నటీనటులు మంచి మంచి సినిమాలో అవకాశాలు వచ్చినప్పుడు తమకు డేట్స్ కుదరకపోవడం వల్లనో లేదా మరే కారణంతోనో వచ్చిన అవకాశాలను వదులుకుంటారు.కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఆ సినిమాలే మంచి హిట్ అవుతుంటాయి.
ఇప్పటికే అలా చాలామంది నటీనటులు తమకు వచ్చిన అవకాశాలను వదులుకొని ఆ తర్వాత బాధపడిన వాళ్లు కూడా ఉన్నారు.ఆ సినిమాలో చేస్తే మనకు మంచి సక్సెస్ ఉండేది కదా అంటూ ఫీల్ అవుతుంటారు.
కానీ అది వారి బ్యాడ్ లక్ అని చెప్పవచ్చు.అలా తమన్నా కూడా గతంలో తనకొచ్చిన అవకాశాలను వదులుకొని ఆ తర్వాత బాధపడినట్లు తెలిసింది.
ఇంతకు తనకు వచ్చిన సినిమాలు ఏవో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే.
తక్కువ సమయంలో స్టార్ హోదా ను సొంతం చేసుకున్న ఈ హాట్ బ్యూటీ ఎంతో అభిమానాన్ని సంపాదించుకుంది.వరుస ఆఫర్లతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
కేవలం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా బాగా దూసుకెళ్తుంది.తమన్నా తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి శ్రీ అనే సినిమాతో 2005లో అడుగు పెట్టింది.
ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాతో మంచి హిట్ అందుకొని వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో, అతిధి పాత్రలలో కూడా నటించింది.
తన నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా సినిమాలలో అవకాశాలు అందుకుంది.తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషలలో కూడా నటించి.అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
అలా నటన పరంగానే కాకుండా తన గ్లామర్ పరంగా కూడా ఎంతోమంది కుర్రకారు హృదయాలను దోచుకుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది తమన్నా.
తన సినిమాలకు సంబంధించిన అప్డేట్లను కాకుండా తన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.
ఇక ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంది.
పైగా ఓటీటీ ప్రాజెక్టులలో కూడా సైన్ చేస్తూ దూసుకెళ్తుంది.అయితే ఇదంతా పక్కన పెడితే గతంలో తమన్నాకు మంచి మంచి సినిమాలలో అవకాశాలు వచ్చాయి.కానీ వాటిని వదులుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇంతకు ఆ సినిమాలు ఏంటంటే.నందమూరి బాలయ్య నటించిన అఖండ సినిమా.
ఈ సినిమాలో ముందుగా తమన్నాని అడిగారట.కానీ ఆ సమయంలో తను వేరే సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాను వదులుకుందని తెలిసింది.
అంతేకాకుండా సవ్యసాచి, స్పైడర్, శివమ్ సినిమాలో కూడా అవకాశాలు అందుకుంది.కానీ ఆ సినిమాల సమయంలో కూడా ఈ అమ్మడికి కలిసి రాలేదని తెలిసింది.
దీంతో ఈ నాలుగు సినిమాలను తమన్నా గతంలో వదులుకుంది.ఇక ఇందులో స్పైడర్ తప్ప మిగతా మూడు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.