వినడానికి ఆశ్చర్యంగా వున్నా, మీరు విన్నది నిజమే.కొన్ని కొన్ని విషయాలు వినడానికి మనకి విడ్డురంగా అనిపిస్తాయి.
కానీ నిజంగా అనుభవం అయినవారు చెప్పినపుడు అసాధ్యం కాదని అనిపిస్తుంది.ముఖ్యంగా ఇలాంటి విషయాలు డాక్టర్లు కాకుండా పేషేంట్లు చెప్పినపుడు బాగా అర్థమవుతాయి.
ఇయాన్ క్లార్క్ అనే అతను ట్విట్టర్లో పంచుకున్న అంశాలు వింటే మనకు అనేక ఆరోగ్య రహస్యాలు తెలుస్తాయి.అతను 64 ఏళ్ల మధ్య కాలంలో అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా మారడానికి ఏం చేసారో చెప్పుకొచ్చాడు.
46 ఏళ్ల వయసులో అతను భారీ ఊబకాయంతో బాధపడేవాడట.నడివయసులో అతను చూడటానికి ముసలాడిలాగా కనబడుతున్నాడని ఇరుగుపొరుగువారు అన్నపుడు చాలా కష్టంగా ఉండేదట.
ఈ క్రమంలో ఇయాన్ క్లార్క్ ఒకసారి దీర్ఘంగా ఆలోచించాడట.దాంతో అతను తన డైలీ లివింగ్ స్టైల్ పూర్తిగా మార్చివేసానని, దాంతో తనజీవితంలో పెనుమార్పులు వచ్చాయని చెప్పుకొచ్చాడు.
మొదట అతను ఆహారంగా తాజా పళ్లు, కాయగూరలు మాత్రమే తీసుకొనేవాడట.ఎట్టి పరిస్థితుల్లోనూ ప్యాకేజ్డ్ ఫుడ్ అంటే రెడీ మెడ్ ఫుడ్ అస్సలు తీసుకోలేదట.
అలాగే నిద్ర కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించుకొనేవాడట.రాత్రి సమయంలో ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు పూర్తిగా ఆపేసి నిద్ర పోయాడట.దీని వల్ల మంచిగా నిద్రపట్టడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉండేదట.అలాగే ఈ క్రమంలో ఉపవాసం చేసేవాడట.
ఉపవాసం అనేది ఎంతముఖ్యమో ఈ సందర్భంగా చెబుతున్నాడు.అలాగే గత కొన్నాళ్లుగా కేవలం 2 పూటలు మాత్రమే భోజనం చేస్తున్నాడట.
ముఖ్యంగా సేంద్రీయ సాగు ద్వారా పండించిన పంటలనే తింటున్నాడట.ఇలా కేవలం తన జీవన విధానం మార్చుకోవడం ద్వారా 46లో కంటే 64లో అందంగానూ, ఆరోగ్యంగాను వున్నానని చెప్పుకొచ్చాడు.