Serial artist naga vardhini : మొదటి ప్రియుడిని భవనంపై నుంచి తోసేసిందంటూ సీరియల్ నటిపై కేసు?

బుల్లితెర నటి నాగవర్దిని గురించి మనందరికీ తెలిసిందే.నాగవర్దిని అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ గుప్పెడంత మనసు సీరియల్ లో లెక్చరర్ అంటే మాత్రం గుర్తుపడతారు.

 Telugu Serial Artist Naga Vardhini In Police Custody Sources Serial Artist Naga-TeluguStop.com

ఈ సీరియల్ లో అప్పుడప్పుడు కనిపిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నాగవర్ధిని.ఈ సీరియల్ తో పాటు గుండమ్మ కథ సీరియల్ లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో నటి నాగవర్దిని కి సంబంధించిన ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.అదేమిటంటే నాగవర్దిని ప్రస్తుతం హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసుల అదుపులో ఉంది.

అందుకు గల కారణం ఆమెను హత్య యత్నం కేసులో భాగంగా అరెస్టు చేశారట.పూర్తి వివరాల్లోకి వెళితే.నాగవర్దిని తన మొదటి ప్రియుడు సూర్య ను రెండవ ప్రియుడు శ్రీను తో కలిసి హతమార్చేందుకు పథకాన్ని రచించినట్లు ఆరోపణలు వినిపించాయి.ఇక ఆమె అనుకున్న విధంగా పథకం ప్రకారం రెండో ప్రియుడుతో కలిసి మొదటి ప్రియుడు సూర్యను భవనం పైనుంచి తోసిసినట్లుగా సూర్య మిత్రులు ఆరోపిస్తున్నారు.

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులకు సూర్య మిత్రులు చేసిన ఫిర్యాదు చేసారు.

Telugu Boyfriend, Serialartist-Movie

కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.అయితే ఆమె ఎందుకు ఆ విధంగా చేసింది.వచ్చిన ఆరోపణలు ఎంతవరకు నిజం.

ఈ విషయాల గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.మొత్తానికి ఈ విషయం మాత్రం తెలుగు బుల్లితెర నటులను కలకలం రేపుతోంది.

కొందరు నటులు ఆమె ఆ విధంగా ఎందుకు చేసిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube