తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులకు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు అయింది.నిందితుల అనారోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ముగ్గురు నిందితులకు ఏ క్లాస్ సదుపాయాలు కల్పించాలని కోరుతూ మరో పిటిషన్ వేశారు.ఈ క్రమంలో ఈ బెయిల్ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు నవంబర్ 7కి వాయిదా వేసింది.
అదేవిధంగా అనారోగ్యంతో దాఖలు చేసిన పిటిషన్ ను నవంబర్ 2కు వాయిదా వేసింది.







