పొత్తుల అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.ఈ సందర్బంగా తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగానే పోరాటం చేస్తుందని తెలిపారు.
టీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తు ఉండదని పేర్కొన్నారు.టీఆర్ఎస్ విధానాలకు తాము పూర్తి వ్యతిరేకమని వెల్లడించారు.
టీఆర్ఎస్ తో పొత్తు వద్దని తెలంగాణ కాంగ్రెస్ నేతలే చెబుతున్నారని తెలిపారు.అవినీతికి పాల్పడే వారితో కలిసి మేం వెళ్లలేమని వెల్లడించారు.
బీఆర్ఎస్ ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చన్న ఆయన దాని వలన కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం లేదని చెప్పారు.కేసీఆర్ కు కావాలంటే అంతర్జాతీయ పార్టీ కూడా పెట్టుకోవచ్చన్నారు.