ఉత్తరాఖండ్‌లోని ఆ టూరిస్ట్ డెస్టినేషన్‌కి పేరు మార్పు.. అదేంటంటే?

మన భారతదేశంలో ఉన్న చాలా స్థలాలు, స్టేషన్లు, రోడ్ల పేర్లు ఇప్పుడు పెట్టినవి కాదు.బ్రిటిష్ కాలంలో తెల్లోల్లు పెట్టిన పేర్లు కూడా ఇప్పటికీ మన దేశంలో కొనసాగుతున్నాయి.

 Uttarakhand Tourist Destination Lansdowne Name Change To Kalon Danda Details, La-TeluguStop.com

అయితే వీటిని మార్చేసి స్థానికత ఉట్టి పడేలా పేర్లు పెడుతోంది భారత ప్రభుత్వం.బ్రిటిష్ సామ్రాజ్య అవశేషాలను పూర్తిగా తొలగించాలనే ఉద్దేశంతో అనేక పేర్లను ఇప్పుడు గవర్నమెంట్ మార్చేస్తోంది.

కాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ అయిన లాన్స్‌డౌన్‌ పేరు కూడా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

కనుచూపుమేరా పచ్చదనంతో అత్యంత అందంగా ఉండే ఈ హిల్‌స్టేషన్‌కు ‘కలోన్ దండా’గా పేరు మార్చాలనే ప్రతిపాదన ఆల్రెడీ చేసింది.

బ్రిటీషర్లు ఈ ప్రాంతం పేరును లాన్స్‌డౌన్‌గా మార్చడానికి ముందు దాని అసలు పేరు కలోన్ దండా.రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) ఉత్తరాఖండ్‌లోని కంటోన్మెంట్ ప్రాంతాలలో ఉన్న పట్టణాలు, రోడ్లు మొదలైన వాటికి సంబంధించిన బ్రిటిష్ కాలంనాటి పేర్లపై సమాచారాన్ని కోరింది.

స్థానిక సంస్కృతికి అనుగుణంగా వాటి పేరు మార్చాలని విశ్వసిస్తోంది.

Telugu Indian, Kalon Danda, Lansdowne, Change, Popular Tourist, Uttarakhand-Late

గర్హ్‌వాలిలో కాలు అంటే నలుపు.దండా అంటే కొండలు అని అర్థం.మొత్తంగా కలోన్ దండా అంటే నలుపు కొండలు అని అర్థం.1887లో అప్పటి వైస్రాయ్ ఆఫ్ ఇండియా (1888-1894), లార్డ్ లాన్స్‌డౌన్ పేరు మీద ఈ ప్రదేశానికి లాన్స్‌డౌన్ అనే పేరు వచ్చింది.గర్హ్వాల్ రైఫిల్స్ రిక్రూట్ ట్రైనింగ్ సెంటర్, క్యాటరింగ్ కోసం బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు.

కాగా ఈ రోజుల్లో, ఇండియన్ ఆర్మీకి చెందిన ప్రసిద్ధ గర్వాల్ రైఫిల్స్ దాని రెజిమెంటల్ సెంటర్‌ను ఇక్కడ కలిగి ఉంది.ప్రకృతి సౌందర్యాలకు నిలయమైన ఈ ప్రాంతం పేరు ఎప్పుడు మారుతుందో చూడాలిక.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube