తారక్ కు ఆహ్వానం వెనుక ఆ రాజకీయ పార్టీ.. నమ్మకపోయినా నిజాలివేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభ ఉన్న టాలీవుడ్ నటులలో ఒకరు కావడంతో పాటు పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న నటుడు అనే సంగతి తెలిసిందే.తారక్ కు కర్ణాటక సీఎం నుంచి ఆహ్వానం అందడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

 Bjp Behind Junior Ntr Invitation Details, Junior Ntr, Bjp, Amith Sha, Karnataka,-TeluguStop.com

తారక్ కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెడుతుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.అయితే తారక్ కు ఆహ్వానం అందడం వెనుక బీజేపీ ఉందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నవంబర్ 1వ తేదీన కర్ణాటక రాష్ట్రంలో జరగనున్న కార్యక్రమానికి తారక్ హాజరు కానున్నారు.దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డ్ ఇస్తున్న నేపథ్యంలో తారక్ కు ఆహ్వానం అందింది.

తెలుగులో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ తారక్ కు ఆహ్వానం అందడం వెనుక అసలు కారణం ఇదేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.కొన్ని నెలల క్రితం అమిత్ షా తారక్ ను కలిసిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో తారక్ బీజేపీ తరపున ప్రచారం చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరిగినా ఆ ప్రచారం ఏ మాత్రం నిజం కాలేదు.అయితే తారక్ మాత్రం బహిరంగంగా బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు ఎక్కడా వెల్లడించకపోవడం గమనార్హం.

Telugu Amith Sha, Basvaraj Bommai, Ntr, Karnataka, Karnataka Cm, Karnatakaratna,

మరోవైపు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్వరలో రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొననున్నారని కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే మూవీ షూట్ త్వరలో మొదలు కానుందని సమాచారం అందుతోంది.

కొరటాల శివ మైథలాజికల్ టచ్ తో గత సినిమాలకు భిన్నమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.డిసెంబర్ నెల నుంచి ఈ సినిమా షూట్ మొదలుకానుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.తారక్ బీజేపీలో యాక్టివ్ కావాలని ఆ పార్టీ తన వంతు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube